ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని చాలా మంది యువత భావిస్తారు. ఇక పెళ్లిలో వధువరుల కుటుంబ సభ్యులు, బంధువులు చేసే సందడి మాములుగా ఉండదు. ఆట, పాటలు, డ్యాన్సులతో పెళ్లి మండపంలో తెగ ఎంజాయ్ చేస్తారు. వివాహం అనేది ఎన్నో తీపి గుర్తులను మిగుల్చుతుంది. అలానే పెళ్లిళ్లలో జరిగే కొన్ని ఘటనలు చేదు జ్ఞాపకంలా మిగిలిపోతాయి. కొన్ని పెళ్లిళలో వధువరులు.. ఒకరిపై మరొకరు భౌతిక దాడికి దిగుతుంటారు. ఇటీవలే ఓ వివాహంలో పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిందని.. అందరి ముందుకు పెళ్లి కొడుకు చెంప దెబ్బ కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తరువాత పెద్దలు సర్ధి చెప్పడంతో అంతా సవ్యంగా జరిగింది. తాజాగా ఓ నవదంపతులు చేసిన రచ్చ మాములుుగా లేదు. పెళ్లి మండపం పైనే ఇద్దరు పిచ్చ పిచ్చగా కొట్టేసుకున్నారు. ఎంతమంది ఆపేందుకు ప్రయత్నం చేసిన ఎవరికి వారు తగ్గేదేలే అన్నాట్లు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్వకాలం మాదిరిగా నేటికాలంల అమ్మాయిలు లేరు. మాటకు మాటకు, దెబ్బకు దెబ్బ అనే రీతిలోనే ఉన్నారు. తాము ఎందులోనూ మగవారికి తక్కువ కాదు అనే భావనలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అందుకు తగినట్లే ప్రతి రంగంలోనూ అమ్మాయులు.. అబ్బాయిలకు పోటీగా రాణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల విషయంలో కూడా వారి కండీషన్లే ఎక్కువగా ఉంటాయి. భర్త..తనపై పెత్తనం చేస్తానంటే సైలెంట్ గా ఉండే ఆడవాళ్లు నేటికాలంలో చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రతీ విషయంలో భర్తతో సైతం పోటీపడుతున్నారు. అందుకు సంకేతంగా పెళ్లి సమయంలోనే వారు తమ హుందాతనాన్ని చూపిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే అబ్బాయిలే ఓ మెట్టు తగ్గుతున్నారు. ఇక ఇద్దరు పోటాపోటీకి దిగితే.. అక్కడే జరిగేది పెళ్లి కాదు.. కురుక్షేత్రమే. తాజాగా ఓ నవ దంపతుల మధ్య పెళ్లి మండపం పై జరిగిన గొడవ ఓ చిన్నపాటి కురుక్షేత్రాన్నే తలపించింది.
ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడు.. వధువుకు స్వీట్ ముక్కను తినిపించేందుకు ప్రయత్నించాడు. ఆమె వద్దని నిరాకరించింది. కానీ, మనోడు స్నేహితుల ముందు పరువుపోతుందనో లేక మరే కారణంతోనో.. పెళ్లికూతురికి బలవంతంగా మిఠాయి తినిపించే ప్రయత్నం చేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన వధువు.. స్టేజీపై అందరు చూస్తుండగానే వరుడి చెంపచెళ్లుమనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి జట్టు మరొకరు పట్టుకొని పెళ్లి మండపంపైనే కొట్టుకున్నారు. వధూవరులు గొడవ పడుతున్న తీరు చూసి, పెళ్లికి వచ్చిన అతిథులు వెంటనే మండపంపైకి పరుగెత్తారు. ఆవేశంలో ఉన్న వారిద్దరు అతిథులపై చేయి చేసుకోవడం కొసమెరుపు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022