రాజస్తాన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు వరుడి ముందే వధువును కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
నేటి కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిల కన్న ప్రేమ పెళ్లిళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇంటి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వాళ్లు అంగీకరించకపోవడంతో ఎదురించి మరీ వివాహం చేసుకుంటున్నారు. ఇది జీర్ణించుకోలేని యువతి కుటుంబ సభ్యులు వరుడిని హత్య చేయడమో లేదంటే, యువతిని కిడ్నాప్ చేయడమో చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ లో కూడా అదే జరిగింది. కొద్దిసేపట్లో వివాహం అనగా వరుడి ముందే వధువును కిడ్నాప్ చేశారు ఆమె కుటుంబ సభ్యులు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ బికనీర్ పరిధిలోని రాంపుర ప్రాంతానికి చెందని ఓ యువతి ముఖేష్ నాయక్ అనే యువకుడిని ప్రేమించింది. వీరి ప్రేమాయణం చాలా ఏళ్లుగా కొనసాగింది. ఇక చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అతడితో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇక చేసేదేంలేక సోమవారం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే సోమవారం యువతి, యువకుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు బయలు దేరారు. ఇక పక్కా ప్లాన్ తోనే యువతి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఇక కొద్దిసేపట్లో పెళ్లి అనగా.. వరుడి ముందే వధువుని కిడ్నాప్ చేశారు ఆమె కుటంబ సభ్యులు. వరుడి కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆగకుండా ఆ వధువును ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
— krishna veni (@krishna66577649) June 29, 2023