ఈ మధ్యకాలంలో ప్రధానికి, ముఖ్యమంత్రులకు యువకులు, పిల్లలు లేఖలు రాస్తూ తమ విజ్ణప్తిని తెలియజేస్తున్నారు. ఇలా ఎంతో మంది రాస్తున్న లేఖలు ప్రధాని కార్యాలయానికి కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఇక తాజాగా మరో లేఖ రాస్తూ ఆశ్చర్యపరిచారు ఓ అక్కాతమ్ముళ్లు. ఇక వారు ఎక్కడ నుంచి రాశారు. రాసిన లెటర్ లో ఏముందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అస్సాం రాష్ట్రానికి చెందిన 5,6 ఏళ్ల అక్కాతమ్ముళ్లు రవ్జా, ఆర్యన్. ఈ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు ప్రధాని మోదీకి లేఖలు రాస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రియమైన మోదీజీ.. మాకు పెరిగిన పాల దంతాలు ఊడిపోయాయి. దీంతో మాకు ఇష్టమైన ఆహారాన్ని తినలేక పోతున్నామని దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
దీంతో వీరిద్దరి లేఖలను వారి మామయ్య సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటంతో మరింత వైరల్ గా మారాయి. వీరి లెటర్ ను చదవిన నెటిజన్స్ తోచిన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక మీరు కూడా ఈ అక్కాతమ్ముళ్లు ప్రధానికి రాసిన లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
