ఆమె పేరు నాన్సీ హాక్, వయసు 56 ఏళ్లు. 56 ఏళ్లు కేవలం అంకెలు మాత్రమే అంటూ.. చివరికి ఓ మనవడికి జన్మనిచ్చింది. వినటానికి ఆశ్యర్యంగా ఉన్న ఈ స్టోరీలో అసలేం జరిగిందంటే?
ప్రపంచ వ్యాప్తంగా అప్పుడప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. అవి నిజమే అయినా.. మనకు నమ్మశక్యంగా అనిపించవు. ఇదిలా ఉంటే.. 56 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు ఓ మనవడికి జన్మనిచ్చింది. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ముమ్మాటికి నిజం. అసలు నాయనమ్మ మనవడికి జన్మనివ్వడం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో నాన్సీ హాక్ అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె కొడుకు జెఫ్, కోడలు కాంబ్రియా అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు.
అయితే.. నాన్సీ హాక్ కోడలు కాంబ్రియా 2021లో కవలలకు జన్మనిచ్చింది. ఇక కొంత కాలం తర్వాత జెఫ్, కాంబ్రియా దంపతులు మరో బిడ్డ కోసం ప్లాన్ చేయాలని అనుకున్నారు. కానీ, కోడలు కాంబ్రియాకు ఉన్న అనారోగ్య కారణాల వల్ల ఆమె మరో బిడ్డకు జన్మనివ్వడం ఆమె ప్రాణాలకే ముప్పు అని వైద్యులు తెలిపారు. ఈ సమయంలో ఆ దంపతులకు ఏం చేయాలో అస్సలు తోచలేదు. ఈ నేపథ్యంలోనే జెఫ్, కాంబ్రియా దంపతులకు సరోగసి ద్వారా బిడ్డను కనొచ్చని ఐడియా తట్టింది.
ఈ దంపతుల నిర్ణయాన్ని స్వాగతించిన నాన్సీ.. సరోగసికి నేను సిద్దమని చెప్పింది. తల్లి మాటను విన్న కొడుకు జెఫ్.. షాక్ తిన్నాడు. ఇక అనంతరం తల్లి నాన్సీ ఎలాగో కొడుకు, కోడలిని నచ్చచెప్పి వైద్యులను సంప్రదించారు. కట్ చేస్తే.. ఇటీవల నాన్సీ 56 ఏళ్ల వయసులో మనవడికి జన్మనిచ్చింది. దీంతో జెఫ్, కాంబ్రియా దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. 56 ఏళ్ల వయసులోనూ ఈ వృద్దురాలు మనవడికి జన్మనివ్వడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. 56 ఏళ్ల వయసులో మనవడికి జన్మనిచ్చిన ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.