సామాన్యంగా మగవారు పీకలదాకా తాగి తూగుతూ పబ్లిక్ లో అల్లరి చేయడం.. అల్లరిపాలు కావడం చూస్తుంటాం. కానీ తాజాగా హైదరాబాద్ నగరంలోని మోతీనగర్ లో ఓ యువతి తప్పతాగి తూగుతూ అల్లరి చేసింది. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం ఆ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మోతీనగర్ లోని మిడ్ ల్యాండ్ బేకరీలో యువతి హల్చల్ మాములుగా లేదు. బేకరీకి వచ్చిన కస్టమర్స్ పై దురుసుగా మాట్లాడుతూ.. వారిపై తినుబండారాలను విసిరి రచ్చ చేసింది. వెంటనే కస్టమర్లు స్పందించి పోలీసులకు సమాచారం అందినచడంతో యువతిని ఎస్ఆర్ నగర్ స్టేషన్ కు తరలించారు. ఈ వైరల్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలుపగలరు.