వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైస్ షర్మిలను మహబూబాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేస్తున్న పాదయాత్రకు మహబూబాబాద్‌లో అనుమతిని రద్దు చేశారు. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ నెలకొని ఉంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్ చేస్తున్న పాదయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. మహబూబాబాద్‌లో ఆమె ఆదివారం పాదయత్ర చేయాల్సి ఉంది. దీనికి పోలీసుల నుంచి షర్మిల ముందే అనుమతి తీసుకున్నారు. కానీ.. మహబూబాబాద్‌లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు. అంతకుముందు షర్మిల.. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు షర్మిల్ పాదయాత్రను అడ్డుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా పాదయాత్ర అనుమతిని రద్దు చేసి, షర్మిలను అరెస్ట్ చేశారు. దీంతో మహబూబాబాద్‌లో ప్రస్తుతం హైటెన్షన్ నెలకొని ఉంది.
అయితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత.. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓదార్పుయాత్ర చేపట్టిన విషయం తెలిసింది. ఉమ్మది ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటిస్తూ.. వైఎస్సార్ మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఓదార్చుకుంటూ యాత్ర చేపట్టారు. అయితే.. ఈ యాత్రను మహబూబాబాద్‌లో అడ్డుకున్నారు. రైల్వే స్టేషన్‌లో ఊహించని వ్యతిరేకత వ్యక్తం అయింది. జగన్‌ను మహబూబాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమని ఆందోళన కారులు స్టేషన్ రాళ్లు రువ్వారు. కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. భయానక పరిస్థితుల్లో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ షర్మిల యాత్ర విషయంలోనూ అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. పోలీసులు పాదయాత్ర అనుమతిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
YS షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్ చేస్తున్న పాదయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. మహబూబాబాద్‌లో పాదయత్ర చేసేందుకు అనుమతి రద్దు చేశారు.#YSRTP #YSSharmila #Mahabubabad #SumanTV
— SumanTV (@SumanTvOfficial) February 19, 2023