ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఎవరి మీద కలుగుతుందో ఊహించలేము. అనుకోకుండా పుట్టే ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య విడదీయరాని బంధంగా ఏర్పడుతుంది. ఇదే తరహాలో ఓ యువకుడు ఓ ట్రాన్స్ జెండర్ పై మనసు పారేసుకున్నాడు. ఆ వివరాలు తెలుసుకుందాం.
పెళ్లిల్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఎప్పుడు ఎవరితో వివాహం జరుగుతుందో ఊహించలేము. సాధారణంగా పెళ్లిల్లు ఆడ, మగ మధ్య జరుగుతాయి. కానీ ఈ మధ్యకాలంలో ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరు మగవాళ్లు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు. సమాజంలో స్వతంత్రంగా జీవించేందుకు ఎవరికి నచ్చిన నిర్ణయాలను వారు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసలు వారు ఎక్కడ కలిశారు. ఎలా ఒక్కటయ్యారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా జరిగే పెళ్లిల్లలో పెద్దలు కుదిర్చిన సంబంధాలతో పెళ్లిల్లు జరుగుతాయి. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది యువతీ యువకులు ఒకరిపై ఒకరు ఇష్టపడి ప్రేమించుకుని వివాహాలు చేసుకుంటున్నారు. అయితే ఓ యువకుడు రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఏర్పర్చుకున్నాడు. అలా కొంత కాలం తరువాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. రేండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. ఈ క్రమంలో ఇదే విషయాన్ని ఇరువురు ఇంట్లో పెద్దలకు చెప్పారు. కుటుంబసభ్యులు వీరి ప్రేమకు సరే అనడంతో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ బానోత్ రాధిక, డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధరావత్ వీరు ఓ రోజు రైలు ప్రయాణం చేసే సమయంలో కలిశారు. ఒకరికి ఒకరు పరిచయం చేసుకున్నారు. కొంత కాలానికి పరిచయం కాస్త ప్రేమగా మారింది. రేండేళ్లుగా ప్రేమించుకున్న ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పారు. వారు అంగీకరించడంతో గార్లమండలం మర్రి గూడెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రులు, కొంత మంది ట్రాన్స్ జెండర్లు హాజరవ్వగా వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ట్రాన్స్ జెండర్ అయిన రాధికను పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచిన ధరావత్ వీరు ను పలువురు అభినందిస్తున్నారు.