దేశంలో ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ట్రాఫిక్ నియమాలు సక్రమంగా పాటించకపోతే కొరడా ఝులిపిస్తున్నారు. నో పార్కింగ్ స్థలంలో వాహనాలు పార్క్ చేస్తే ఫైన్ వేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఆ వాహనాలను స్టేషన్ కి కూడా తరలిస్తుంటారు. సదరు వాహన యజమాని ఫైన్ కట్టి వాహనాలను తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా ఓ మహిళ తన కారుకు చలాన్ వేసినందుకు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగి నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన కోఠీలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
దివ్య అనే మహిళ హైదరాబాద్ కోఠి బ్యాంగ్ స్ట్రీట్ వద్ద నో పార్కింగ్ స్థలంలో తన కారు పార్క్ చేసి వెళ్లింది. అటుగా వచ్చిన ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ ఏరియాలో ఉన్న కారుని చూసి కారు యజమానిని పిలిచారు.. ఎవరూ స్పందించకపోవడంతో కార్ వీల్ కి లాక్ వేసి చలానా రాశారు. అక్కడికి వచ్చిన దివ్య అనే మహిళ కారు తనదే అని.. తన కారుకు ఎందుకు చలానా విధించారని ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించింది. ఇలా మాటా మాటా పెరిగిపోవడంతో మహిళ తన కారుకే చలానా వేస్తారా.. అంటూ పోలీసులతో గొడవకు దిగింది. అంతేకాదు ఓ ట్రాఫిక్ పోలీస్ వద్ద ఉన్న వాకీ టాకీని తీసుకొని నానా హంగామా సృష్టించింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
నో పార్కింగ్ ఏరియాలో కారు నిలిపినందుకే తాము చలాన్ విధించామని.. అనవసరంగా ఆ మహిళ తమతో గొడవ పెట్టుకుంటుందని ట్రాఫిక్ పోలీసులు అన్నారు. ఆమెకు ఎంత సర్ధి చెప్పాలని చూసినా తమ మాట వినకుండా హంగామా సృష్టించిందని అంటున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అలాగే కారు ను కూడా సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: క్లాస్ రూంలో మద్యం సేవించి టీచర్ మాస్ స్టెప్పులు..! వీడియో వైరల్