సినిమా టికెట్ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తోంది. పైగా ఏపీతో పొలిస్తే.. తెలంగాణలో సినిమా టికెట్ ధరలు భారీగా ఉన్నాయనేది అందరికి తెలిసిన సంగతే. భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి పది రోజులు టికెట్ ధర భారీగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. RRR సినిమా కలెక్షన్ల విషయంలో ఈ అంశం బాగా కలసి వచ్చింది. తరువాత వచ్చే సినిమాలకు కూడా ఇదే వెసులుబాటు ఉంటుందని భావించారు. అయితే వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. త్వరలో విడుదల కాబోయే వరుణ్ తేజ్ గని సినిమా టికెట్ ధరను తగ్గిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తగ్గించిన సినిమా టికెట్ ధరలను గని సినిమా యూనిట్ ప్రకటించింది. మల్టీప్లెక్స్ థియేటర్స్ కు 200 ప్లస్ జీయస్టీ, సింగిల్ స్క్రీన్ లకు 150 ప్లస్ జీయస్టీగా ఫిక్స్ చేశారు. సవరించిన ధరలతోనే గని చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గని చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా.. నదియా, నరేశ్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.