హైదరాబాద్ నగర వాసులను అలరించేందుకు నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ సిద్ధమైయింది. నేడు 81 వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్) ను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ప్రారంభిస్తారు. నుమాయిష్ కు సంబంధంచింది అన్ని శాఖలు అనుమతులు ఇచ్చాయని సొసైటీ సభ్యులు తెలిపారు. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ జరిగినన్ని రోజులు.. ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుమ రూ. 30 గా నిర్ణయించారు. సుమారు 1500 స్టాళ్లకుఅనుమతి ఇచ్చినట్లు సోసైటి సభ్యులు తెలిపారు. 46 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహం 3గంటల వరకు సందర్శకులను వాహానాలతో అనుమతిస్తామని.. కారుకు రూ.600, ఆటోకు రూ.300, ద్విచక్రవాహనానికి రూ.100 రుసుముగా నిర్ణయించామని చెప్పారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 45 రోజుల పాటు జరిగే ‘నుమాయిష్’ కు లక్షలాది మంది సందర్శకులు వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు రోజూ సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ వేళల్లో వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు కేటాయించినట్టు పేర్కొన్నారు.
సిద్ది అంబర్ బజార్, జాంబాగ్ మీదుగా నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు. బేగంబజారు వైపు నుంచి వచ్చే వాహనాలను దారుస్సలాం వైపు వెళ్లాల్సి ఉంటుంది. మూసాబౌలి నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను సిటీ కళాశాల వద్ద నయాపూల్ వైపు వెళ్లాలి. బషీర్బాగ్ వచ్చే వాహనాలు ఏఆర్ పెట్రోల్ బంక్ వైపు నుంచి అబిడ్స్ వైపు వెళ్లాలి. ఈ ఆంక్షలు ఎగ్జిబిషన్ పూర్తైయ్యేవరక ఉంటాయని పోలీసులు తెలిపారు.