ఇటీవల జరిగిన ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ఘటన దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలసిందే. అయితే ఈ ఘటన తరహాలో రెండు రైళ్లను ఢీకొనేలా చేస్తామని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బెదిరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు లేఖ రాశారు.
గతనెల రెండో తేదీన ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన యావత్ భారతదేశ ప్రజల గుండెల్లో గుబులు రేపింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలో ఘోర రైల్వే ప్రమాదం చోటుచేసుకున్న సంగతి అందరికి తెలిసందే. అయితే ఈ ప్రమాదంలో 295 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. ఇంత దారుణ పరిస్థితి కళ్లారా చూసిన వారికి హృదయం కలిచివేసింది. కొందరి మృతదేహాలను గుర్తించడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ‘రైల్వే భద్రత కమిషనర్’ దర్యాప్తు నివేదిక ప్రకారం ఈ ఘోర రైలు ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నలే అని తెలిపింది.
ఈ ప్రమాదాలను అధిగమించడానికి రైల్వే భద్రత కమిషనర్ తీసుకోవలసిన చర్యల గురించి తెలిపింది. ఈ దుర్ఘటన మరువక ముందే ఒడిశా తరహాలోనే మరోరైలు ప్రమాదం జరుగనుందని బెదరింపు లేఖ వచ్చింది. హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో నడిచే ట్రైన్స్ ఒకదానికొకటి ఢీకొనేట్లు చేస్తామని ద.మ.రైల్వేకి బెదిరింపు లేఖ వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ మాదిరిగానే హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో ట్రైన్స్ ఒకదానికొకటి ఢీకొనేటట్లు చేస్తామని దక్షిణ మధ్య రైల్వేకి బెదిరింపు లెటర్ వచ్చింది. దీంతో ఈ లేఖ విషయం వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణ పోలీసులకు సమాచారాన్ని అందజేశారు.
తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. రైల్వే అధికారులు మూడు రోజుల క్రితం బెదిరింపుల లేఖకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారని ఉత్తర మండల డీసీపీ చంనా దీప్తి తెలిపారు. దీనిపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.లేఖ ఎక్కడినుండి వచ్చిందే అంశంపై రైల్వే అధికారులనుంచి మరిన్ని డీటైల్స్ కలెక్ట్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదానికి గల కారణమేంటో రైల్వే సేఫ్టీ కమిషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను రైల్వే సేఫ్టీ కమిషన్ రైల్వే బోర్డుకు సబ్మిట్ చేసింది.
ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాదానికి ప్రధాన కారణం అదే.. రైల్వే భద్రత కమిషనర్ నివేదిక