తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనవడితో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. తాతమనవళ్లు ఇద్దరూ పరస్పరం రంగులు విరజిమ్ముకుంటూ తెగ ఎంజాయ్ చేశారు.
భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో హోలీ ఒకటి. ఈ పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహంలో మునిగిపోతారు. చిన్నాపెద్దా తేడా తెలియకుండా రంగులు చల్లుకుంటూ తెగ సందడి చేస్తారు. ఏటా లాగానే ఈ సారి కూడా దేశ ప్రజలు హోలీని ఎంతో ఘనం జరుపుకున్నారు. ప్రతి ఊరూ, వాడా రంగుల మయంతో కళకళలాడిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హోలీ పండగను అట్టహాసంగా జరుపుకున్నారు. ఇక సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖల వరకు అందరు హోలీ సంబరాల్లో పాల్గొన్ని ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనవడితో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంగళవారం హోలీ పండగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రజలు బంధుమిత్రులతో కలిసి హోలీ ఆడుతూ ఆస్వాదించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో మనవడితో కలిసి హోలీ ఆడారు. మనవడు తలసాని తారక్ తో కలిసి బాత్ టబ్ లో దిగిన ఆయన కూడా ఓ చిన్న పిల్లాడిగా మారిపోయారు. తాత మనవళ్లు.. ఇద్దరూ పరస్పరం వాటర్ గన్ తీసుకుని రంగులను మీద చల్లుకున్నారు. మనవడిలానే మంత్రి కూడా ఓ వాటర్ గన్ తీసుకుని రంగులు విరజిమ్ముతూ తెగ ఎంజాయ్ చేశారు. ఎప్పుడూ ప్రజా జీవితంలో బిజిబిజీగా ఉండే మంత్రి తలసాని… మనవడితో ఆడుకోవడం చూసి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అలానే ప్రజలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన మనవడితో కలిసి జరుపుకున్న హోలీ సంబరాలను.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనవడు తలసాని తారక్ తో హొలీ వేడుకలు.. pic.twitter.com/Mc1wt6kWa0
— Talasani Srinivas Yadav (@YadavTalasani) March 7, 2023