తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ప్రజల బాగోగులు, మంత్రిగా ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించే విషయం తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా అయ్యా ఇదీ మా పరిస్థితి అనగానే వెంటనే స్పందించే వ్యక్తి కేటీఆర్. ఎవరు సహాయం కావాలని కోరినా క్షణాల్లో సాయం అందేలా ఏర్పాటు చేస్తుంటా మంత్రి కేటీఆర్. కేవలం ట్విట్టర్ వేదికగానే లెక్కలేనన్ని సాయాలు చేశారు. తాజాగా అలాగే వాళ్లకి మీరే దిక్కూ అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.
కార్తిక్ అనే 11 నెలల చిన్నారికి ఒళ్లంతా కాలిపోయింది. దాదాపు 70 శాతం చర్మం కాలిపోయింది. ఆ వీడియోని ట్విట్టర్‌లో పోస్టు చేసి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ చిన్నారి వివరాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అందుకు వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ఆ చిన్నారికి తక్షణమే తగిన వైద్య చికిత్స అందించాలని.. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం మంచి ఆస్పత్రికి తరలించాలి’ అంటూ కేటీఆర్ కార్యాలయ సిబ్బందికి సూచించారు. ఈ విధంగా కేటీఆర్ స్పందించడం, తక్షణ సాయం అందించడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
We will take care immediately brother @KTRoffice please contact the hospital and ensure the best medical attention is provided
If the baby needs to be shifted to a better facility, please do the needful https://t.co/0Uy9C3q9tO
— KTR (@KTRTRS) October 11, 2021