తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సంవత్సరం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 464892 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాజరు కాగా.. 294378 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగింది. 72.3 శాతం అమ్మాయిలు పాస్ కాగా, అబ్బాయిలు 54.24 శాతం మంది పాస్ అయ్యారు. ఇప్పటికే ప్రక్రియ మొత్తం పూర్తి చేశామని, తప్పులు రాకుండా సాఫ్ట్వేర్ ద్వారా కూడా పరిశీలన చేశామని, ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరా మే 6 నుంచి 24వ తేదీ వరకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలను 1,443 పరీక్షా కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఇదిలా ఉంటే ఇంటర్ బోర్డు విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దని ఏదైనా సమస్యలు ఉంటే బోర్డు రెగ్యులర్ టోల్ ఫ్రీ నెంబర్ 18005999333 కి కాల్ చేయాలని ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఆగస్ట్ 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని సబిత తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఫలితాల కోసం :
https://tsbienew.cgg.gov.in/,
https://results. cgg.gov.in,
https://examresults.ts.nic.in లో చూసుకోవచ్చు