ఇటీవల రూ.2 వేల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. సామాన్యుల వద్ద ఈ నోట్లు చాలా వరకు తగ్గిపోయాయి. రూ.2వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మరికొందరు ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. తాజాగా ఆర్బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల రూ. 2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ మే, శుక్రవారం 19 న ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి రెండు వేల నోట్ల ముద్రణ 2018 -19 ఆర్థిక సంవత్సంలోనే నిలిపివేసినప్పటికీ మార్కెట్ లో ఈ నోట్ల చెలామణి గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ధనికుల వద్ద తప్ప సామాన్యులు వద్ద ఈ నోట్లు చాలా వరకు తగ్గిపోయాయి. చాలావరకు రూ.2వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మరికొందరు ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. తాజాగా రూ. 2000 వేల నోట్ల విషయంలో ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే..
ఆర్బీఐ రూ.2 వేల నోట్ల అంశంపై మరోసారి కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే దాదాపు చాలా వరకు రూ. 2వేల నోట్లు బ్యాంకులకు చేరుకున్నాయని వెల్లడించింది. జూన్ 30 నాటికి రూ.2.72 లక్షల విలువైన నోట్లు బ్యాంకుల్లోకి తిరిగి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ. 84 వేల కోట్ల విలువైన రూ. 2వేల నోట్లు బ్యాంకులకు రావలసి ఉందని తెలిపింది. దాదాపు 76 శాతం వరకు రూ.2 వేల నోట్లు బ్యాంకుకు వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు మనీ డిపాజిట్ చేయడం ద్వారా, ఎక్చేంజ్ చేసుకోవడం ద్వారా బ్యాంకుకు చేరాయని తెలిపింది. ఇప్పటికి ప్రజల వద్ద ఉన్న రూ.2వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవాలని సూచించింది.
ఆర్బీఐ రూ.2 వేల నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించినప్పటి నుండి జూన్ 30 వరకు చెలామణిలో చాలా తగ్గిపోయాయని తెలిపింది. బ్యాంకుల్లోకి వచ్చిన రూ.2 వేల
నోట్లు 87 శాతం బ్యాంకు అకౌంట్లలో చేరుకోగా.. 13 శాతం రూ.2 వేల నోట్లను ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు. మార్చి నెలల చివరి వరకు వ్యవస్థలో చెలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల విలువ రూ.3.62 లక్షల కోట్లు ఉంది. అయితే మే 19 నాటికి చూస్తే ఈ విలువ రూ.3.56 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుతం రూ.2 వేల నోట్లు రూ.84 వేల కోట్లకు తగ్గింది. రాబోయే రోజుల్లో మిగిలిన రూ.2వేల నోట్లు కూడా బ్యాంకుల్లో జమ కానున్నాయి.