నేటి ఆధునిక యుగం అంతా టెక్నాలజీ యుగంగా మారిపోతుంది. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా మనకు ఏది కావాలన్న చిటికెలో ఇంటికే వస్తున్నాయి. మన వద్ద ఉండాల్సింది కేవలం ఓ స్మార్ట్ ఫోన్ మాత్రమే. దీని ద్వారా ప్రతీది మనకు వద్దకే వస్తుంది. ప్రస్తుత పోటి ప్రపంచంలో కొన్ని యాప్స్ ద్వారా కావాల్సిన వస్తువులు ఆర్డర్ చేసుకుంటే అవి డెలవరీ రూపంలో ఇంటికి చేరుకుంటున్నాయి. అయితే ఇప్పటికే మనకు స్విగ్గీ, జుమాటో, రాపిడో, ఓలా ఇలా ఎన్నో రకాలైన సేవలను అందించే యాప్స్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి పెట్రోలో, డీజిల్ అందించే యాప్ కూడా చేరిపోనుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమనే చెబుతోంది గోఫ్యూయెల్ ఇండియా అనే సంస్థ.
మనం మాములుగా బక్ పై కానీ మరేదైన వాహనంలో కానీ దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు రోడ్డుపైనే సడెన్ గా పెట్రెల్ అయిపోతుంటుంది. అప్పుడు మనకు ఏం చేయాలో అర్థం కాదు. తప్పని పరిస్థితుల్లో ఎలాగైన సరే పెట్రోల్ బంక్ ఎక్కడుంటే అక్కడి వరకు ఒళ్లంత చమటలు కక్కుతున్నా.. బైక్ ను నెట్టుకుంటూ పెట్రోల్ బంక్ వద్ద తీసుకెళ్లాల్సింది. ఇక పెట్రోల్ బంక్ చాలా దూరం ఉంటే వారి గోస వర్ణనాతీతమే. అయితే అలాంటి వారి కోసం గోఫ్యూయెల్ ఇండియా అనే సంస్థ శుభవార్త చెప్పింది.
ఇది కూడా చదవండి: Lottery: లాటరీ కొని మర్చిపోయారు.. దానికి రూ. 7 కోట్ల ప్రైజ్ మనీ తగిలింది!
యాప్ సాయంతో పెట్రోల్ ఏ సమయంలోనైన, ఎంతదూరమైన పెట్రోల్, డీజిల్ డెలవరీ చేస్తామని తెలిపింది. ఈ వార్తతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే శుక్రవారం గోఫ్యూయెల్ ఆధ్వర్యంలో ఫ్రాంచైజీ భాగస్వాములైన హెచ్‌పీసీఎల్ సీజీఎం హరిప్రసాద్ సింగు పల్లి, సుస్మిత ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి తమ కార్యకలాపాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ కోఫౌండర్ ఆదిత్య మీసాల మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ సేవలు చెన్నైలో అందుబాటులోకి తెచ్చామని, వినియోగదారులు యాప్‌లో ఆర్డర్ చేస్తే ఇంధనాన్ని వారు కోరుకున్న చోటుకు అందిస్తామని అన్నారు.
జూలై–సెప్టెంబర్‌లో గువాహటి, సేలంలో కార్యకలా పాలను ప్రారంభిస్తామని, ఆ తర్వాత 2024 నాటికి దేశమంతటా 1,000 వాహనాలతో విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించామని ఆదిత్య మీసాల తెలిపారు. అయితే పెట్రోల్, డీజిల్ డెలవరీని అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, మాల్స్, బ్యాంకులు, గిడ్డంగులు తదితర స్థలాలకూ సరఫరా చేస్తామన్నారు ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.