భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. తన ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది.. తన కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవయే కారణమనేది రామకృష్ణ చేసిన ప్రధాన ఆరోపణ. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రతిపక్ష నేతలు అధికార పక్షంపై విరుచుకు పడుతున్నారు.
తాజాగా వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాఘవ కొత్తగూడెం పోలీసుల అదుపులో ఉన్నారు. వనమా రాఘవేందర్ పై 302,306,307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాఘవేందర్ బెయిల్ కు అప్లే చేసిన రాకుండా కౌంటర్ ఫీల్ దాఖలు చేస్తామంటున్నారు పాల్వంచ ఎఎస్పీ. రాఘవను స్వయంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం వనమా రాఘవ ను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇది చదవండి : బండి నడపడానికి లైసెన్స్ అవసరం లేదు! పోలీసులతో విద్యార్థి వాదన
ఇవాళ ఉదయం నుంచి పోలీసులతో టచ్ లో ఉన్న ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వర్లు.. తన కొడుకు రాఘవను పోలీసులకు అప్పగించారు. కాగా.. ఈ ఘటనపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తనును బాధకు గురిచేసిందని అన్నారు. చట్టం, న్యాయంపై నమ్మకం ఉందన్నారు. తన కొడుకు రాఘవేంద్ర దర్యాఫ్తుకు సహకరించేలా చేస్తానని అన్నారు.