పెళ్లిలో నూతన దంపతులకు బహుమతులు అందజేయడం సహజం. డబ్బులు, బంగారం, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు లాంటివి గిఫ్ట్ గా అందజేస్తుంటారు. ఎవరి స్థోమతను బట్టి వారు ఇరు కుటుంబాల వారికి కట్నాలు సమర్పించుకుంటారు. కొన్ని పెద్దింటి కుటుంబాల వారు వచ్చిన అతిధులకు మంచి గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి మాత్రం ప్రజాప్రతినిధులే చందాలు వేసుకుంటున్న వార్త హల్‌చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కుమార్తె వివాహం ఈ నెల 21న జరగనుంది. ఈ క్రమంలో ఒక్కో సర్పంచ్ రూ . 5,000 ల చొప్పున పంపించాలని ఫోరం తరుపు నుంచి ఒక మెసేజ్ పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. తాము ఇచ్చిన నెంబర్‌కు గూగుల్ పే, ఫోన్ పే చేయాలని ఇంకా ఎక్కువైనా సంతోషమే అని దాని సారాంశం.
ఈ మెసేజ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది ఎమ్మెల్యే రవిశంకర్‌కు అంటే గిట్టని వారు ఇలాంటి పోస్టులు పెట్టి ఆయను ఇరకాటంలో పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరీనంగరల్ లో ఈ విషయంపైనే చర్చలు నడుస్తున్నాయి. ఈవిషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.