ఈ మద్య సినీ, రాజకీయ నేతల ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈటెల రాజేందర్ తండ్రి ఈటెల మలయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా మంగళవారం రాత్రి మృతి చెందారు.
ఇటీవల ఈటెల మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా హైదరాబాద్ ఆర్ వీఎం హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో రాత్రి కన్నుమూశారు. తన తండ్రి తనను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించేవారని.. అలాంటిది తన తండ్రి లేని విషయం జీర్ణించుకోలేకపోతున్నానని ఈటెల కన్నీరు పెట్టుకున్నారు.
ఈటెల రాజేందర్ స్వస్థలం కమలాపూర్ లో పార్థీవదేహాన్ని ఉంచి.. మధ్యాహ్నం ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త విని గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఈటెల రాజేందర్ ని పలువురు బీజేపీ నేతలు, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.