రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంతమ్మ అంత్యక్రియలు మహబూబ్ నగర్ పట్టణంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరణించారు.
ఇక తన తల్లి మృతదేహం వద్ద శీనివాస్ గౌడ్ రోధిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శ్రీనివాస్‌గౌడ్ తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలన్నారు.
రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తదితరులు సంతాపం తెలిపారు. కాగా, ఒకే ఏడాదిలోనే మంత్రికి తల్లిదండ్రులిద్దరూ దూరమయ్యారు.