తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతి ఏర్పాట్లు చేస్తుంది. ప్రైవేట్ పాఠశాలల చదువులు విద్యార్థుల తల్లిదండ్రులకు మోయరాని భారంగా మారుతుందని.. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా చేబడుతుంది. ఇక ప్రభుత్వ పాఠశాల్లలో 1 తరగతి నుంచి 5 వ తరగతి వరకు విద్యార్థులకు చక్కటి చదువు అందించేందుకు తొలిమెట్టు పేరట ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లాల్లోని అధికారులు పాఠశాలలను సందర్శిస్తూ తొలిమెట్టు యొక్క ఉద్దేశ్యం గురించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వివరిస్తున్నారు. అంతేకాదు విద్యార్థుల ఫలితాలును ఎప్పటికప్పుడు మెరుగు పచురుకునే విధంగా ఉపాధ్యాయులు ఏం చేయాలనేదాని గురించి లెర్నింగ్ ట్రాకర్ అనే యాప్ ని రూపొందించారు. దీని గురించి ఆన్ లైన్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. తాజాగా వరంగల్ జిల్లా కలెక్టర్ శశాంక ఉపాధ్యాయుడిగా మారిన ఘటన అందరినీ ఆకర్షించింది.
తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్ గంగారం, శశాంక కోమట్లగూడెంలోని ప్రాథమిక పాఠశాలలకు వెళ్లారు. అక్కడ తొలిమెట్టు రిజిస్ట్రేషన్ అమలు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఉపాధ్యాయుడిగా మారారు.. నేలపై కూర్చొని విద్యార్థులకు సామర్థ్యాన్ని పరీక్షించారు.. చదవడం, రాయడం లో మెలుకువలు నేర్పించారు. తొలిమెట్టు యాప్ రిజిస్ట్రేషన్ అమలు అయ్యే విధానం గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా గంగారం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న సుష్మిత అనే బాలిక వద్ద కూర్చొని కలెక్టర్ శశాంక పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు బాలిక సరైన సమాధానం ఇవ్వడంతో మెచ్చుకున్నారు.
కోమట్లగూడెం ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన ఆయన 3వ తరగతి చదువుతున్న కొంత మంది విద్యార్థులను ఇంగ్లీష్, మ్యాథ్స్ కి సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి చేయాలని.. విద్యార్థుల చదువు విషయంలో మరింత దృష్టి పెట్టాలని కోరారు. లెర్నింగ్ ట్రాకర్ యాప్ స్మార్ట్ ఫోన్స్ లో పనిచేస్తుందని.. దీని వల్ల విద్యార్థుల ఏఏ సబ్జెక్ట్ ల్లో మెరుగుగా లేరన్న విషయం ఉపాధ్యాయులు తెలుసుకోవచ్చని.. ఆ విద్యార్థుకు ఆ సబ్జెక్ట్ పై మరింత అవగాహన పెంచేలా చేయొచ్చని అన్నారు.