ఆ బాలిక ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. పుట్టినప్పటి నుంచే ఒక కాలు లేకపోయినా.. ఎంతో కష్టపడి చదువుతుంది. ఒంటికాలితో రోజూ 2 కిలోమీటర్లు కుంటుతూ.. ఆమె పాఠశాలకు వెళ్లొస్తోంది. చదువుపై ఉన్న ఇష్టమే ప్రేరణగా మారి.. కృత్రిమ కాలు అమర్చుకునేందుకు స్థోమత లేకపోవడంతో అలాగే చిన్నప్పటి నుంచి స్కూల్ కు వెళ్లొస్తోంది. ఆ బాలికకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ చలించిపోయాడు. తాను ఆ బాలికకు సాయం చేస్తానని ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అభిమానులు, కార్యకర్తలు, ప్రజలతో తరచూ కాంటాక్ట్‌లో ఉంటారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఎవరికైనా సాయం కావాల్సి వస్తే వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులకు రీట్వీట్ చేస్తూ వారికి సాయం అందేలా చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా కేటీఆర్ చాలా మందికి సాయం చేశారు. తాజాగా బీహార్ కి చెందిన ఓ బాలిక ఒంటి కాలుతో ప్రతిరోజూ రెండు కిలో మీటర్లు స్కూల్ కి వెళ్తున్న దృశ్యాలు మంత్రి కేటీఆర్ చూసి ఆవేదన చెందారు. ఆ బాలికకు ఎలాగైనా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్విటర్‌లో ఈ వీడియో చూసి ఆ బాలిక వివరాలు ఇవ్వాలని కోరారు.
బీహార్ కి చెందిన ప్రియాంశు కుమారి చిన్నతనం నుంచి ఒంటి కాలిపైనే పాఠశాలకు వెళ్తూ వస్తుంది. ఎన్ని కష్టాలు పడైనా ప్రతిరోజు రెండు కిలోమీటర్లు అలా ఒంటికాలిపై వెళ్తూ చదువుకుంటుంది. ‘నాకు చదువు అంటే చాలా ఇష్టం.. నేను డాక్టర్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం. దయచేసి ప్రభుత్వం స్పందించి నాకు కృత్రిమ కాలును అందించాలని కోరుతున్నాను.. నా జీవిత ఆశయానికి ఊపిరి పోయాలని ప్రార్ధిస్తున్నాను’ అంటూ విజ్ఞప్తి చేస్తుంది.
ప్రియాంశు తల్లిదండ్రులు చిన్నపాటి రైతులు. ఈ కారణంతోనే ఆ బాలికకు కృత్రిమ కాలు కొనిచ్చే స్థోమత లేదని అంటున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ తాము సహాయం చేస్తామని అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
If someone at @ANI can me the girl’s contact details, will be my pleasure to help (in my personal capacity) the young one achieve her dreams https://t.co/5gBoFAsIv0
— KTR (@KTRTRS) July 1, 2022