రెండు శతాబ్దాల చరిత్ర కలిగన హనుమాన్ ఆలయం శిథిలావస్థకు చేరిందని.. దాన్ని పునర్నిర్మించాలని కోరుతూ.. ఏ చంద్రకాంతరావు అనే వ్యక్తి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంగే మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి ఆ ఆలయాన్ని పునర్నిర్మాణానికి కృషి చేస్తానని ప్రకటించారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఆ జిల్లా కలెక్టర్‌తో ఈ విషయం సంప్రదించాలని తన కార్యాలయం సిబ్బందికి కేటీఆర్ సూచించారు. కాగా గతంలో కూడా కేసీఆర్ చాలా సార్లు ట్విట్టర్ వేదికగా తనపై సమస్యలపై తక్షణం స్పందించి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఒక ఆలయ విషయమై అందిన సమాచారంపై వెంటనే స్పందించి భక్తులకు సౌకర్యాలు, ఆలయాన్ని పునర్నిర్మించేందుకు పూనుకోవడంతో నెటిజన్లు కేటీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
We will ensure that the temple is restored
Request @KTRoffice to coordinate with local MLA @Goudmla Garu & @CollectorRRD https://t.co/sfABXd9YYa
— KTR (@KTRTRS) November 16, 2021