తెలుగు రాష్ట్రాలలో ఆయన ఓ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు.. అయినా టాలీవుడ్ కమెడియన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా కెమెరా ముందు కావాల్సినంత కామెడీ పండించగలడు. ఓ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు అయ్యుండి కామెడీ పండించగలడు అనగానే మీకు ఆ మహానుభావుడు ఎవరో అర్థమై ఉంటుంది. అతనే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈయన గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగినా పాల్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు.
ఈ క్రమంలో అప్పుడప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ వార్తల్లో నిలిచే కేఏ పాల్.. ఆదివారం నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో పర్యటించాడు. మరి కేఏ పాల్ పర్యటన అంటే.. మామూలుగా ఉంటుందా! ఆ ఏరియాలో జనాలకు కావాల్సినంత వినోదాన్ని అందించడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో త్వరలోనే ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేఏ పాల్ మునుగోడులోని చౌటుప్పల్ లో పర్యటించాడు.
ఇక పగలంతా పర్యటించిన పాల్.. ఆదివారం సాయంత్రం కోడలు జ్యోతి బెగల్ తో కలిసి స్థానిక మహిళలతో బతుకమ్మ ఆట ఆడటం విశేషం. అదేంటి కేఏ పాల్ బతుకమ్మ ఆట ఆడాడా? అంటే.. అవును. పాల్ బతుకమ్మ ఆడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే.. కేఏ పాల్ బతుకమ్మ ఆడినందుకు నెట్టింట కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు నీకివన్నీ అవసరమా? అంటూ కామెంట్ చేస్తున్నారు. అయినా కేఏ పాల్ ది కొంచం విచిత్రమైన మనస్తత్వం అని తెలిసిందే. మరి కేఏ పాల్ తో మామూలుగా ఉండదు చూశారా.. అని ఇంకొందరు అనుకుంటున్నారు.
చౌటుప్పల్ లో తన మునుగోడు పర్యటన లో భాగంగా స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు DR KA పాల్ మరియు జ్యోతి బెగల్ . pic.twitter.com/xKlDRSewHJ
— Dr KA Paul (@KAPaulOfficial) September 25, 2022