ఈమధ్యకాలంలో.. లాటరీ వరించిన అదృష్టవంతుల గురించి చాలా వార్తలు చదివాం. జీవితంలో.. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. వారిని అదృష్టం.. లాటరీ రూపంలో వరించింది. ఇలా కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్న వారంతా.. మన పొరుగు రాష్ట్రాలకు చెందిన వారే. కానీ తొలిసారి.. ఓ తెలంగాణ కుర్రాడికి కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అతడి అదృష్టం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఎవరా కుర్రాడు.. లాటరీ కొన్నది మన దేశలోనేనా.. వంటి వివరాల.. బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన ఈ తెలంగాణ యువకుడిని అదృష్టం వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 కోట్ల రూపాయలను లాటరీలో గెలుచుకున్నాడు. అతడే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్‌కు చెందిన అజయ్.
గ్రామంలో సరైన ఉపాధి లభించకపోవడంతో.. బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం అజయ్ దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే వచ్చే జీతంతో తన ఆర్థిక కష్టాలు తీరాలంటే ఏళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలో ఓ సారి అతడు.. కష్టాల నుంచి గట్టెక్కేందుకు తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. దానిలో భాగంగా.. కొన్ని రోజుల క్రితం రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. కానీ లాటరీ తనకు తగులుతుందని అతడిలో ఏమాత్రం నమ్మకం లేదు. ఏదో దేవుడి మీద భారం వేసి టికెట్ కొన్నాడు. వస్తే కోట్లు.. లేదంటే.. టికెట్ డబ్బులు లాస్. అదే ఆలోచనతో ఉన్నాడు అజయ్.
అజయ్.. దుబాయ్‌లో అధికారికంగా నిర్వహించే.. ఎమిరెట్స్ లక్కీ డ్రా వారి లాటరీ టికెట్స్ కొన్నాడు. దీనిలో ఎలా ఉంటుంది అంటే.. లాటరీ టికెట్ కొన్న వాళ్లు.. నిర్వాహాకులు ఇచ్చే నెంబర్లు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని నెంబర్లు మ్యాచ్ అయితే.. వాటికి తగ్గట్టుగా ఫ్రైజ్ మనీ ఉంటుంది. ఈ లాటరీకి సంబంధించి అజయ్ రెండు టికెట్లు కొన్నాడు. ఇక డ్రా నిర్వహించే రోజున.. అజయ్.. తన దగ్గరున్న రెండు టికెట్లకు సంబంధించి 6 నెంబర్లను కలిపాడు. దాంతో లాటరీ నిర్వాహకులు.. దుబాయ్ కరెన్సీ ప్రకారం అజయ్ కోటిన్నర దిర్హామ్స్ గెలుచుకున్నట్లు తెలిపారు. ఆ మొత్తం మన భారతీయ కరెన్సీలో సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
నెలకు కనీసం 30 వేల రూపాయల జీతం కూడా అందుకోని అజయ్.. ఒకేసారి ఏకంగా ఒకేసారి 30 కోట్ల రూపాయలు గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తాను ఇంత మొత్తం గెలుస్తానని కలలో కూడా అనుకోలేదని.. ఈ డబ్బు తీసుకుని ఇండియా వెళ్లి.. అప్పులు తీర్చి.. వ్యాపారం చేస్తానని తెలిపాడు అజయ్. మరి జగిత్యాల కుర్రాడిని వరించిన అదృష్టాన్ని చూసి మీరు ఎలా ఫీలవుతున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Lottery: జగిత్యాల యువకుడికి.. దుబాయ్‌లో రూ.30 కోట్ల జాక్‌పాట్#Lottery #Dubai #Jagityala #VideoViral pic.twitter.com/WxSSICKjqb
— Eenadu (@eenadulivenews) December 23, 2022