ఈ మద్య కొంత మంది ఆకతాయిలు అర్థరాత్రి రోడ్లపై హల్ చల్ చేస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో కొంతమంది యువత బైక్ రేసింగ్ లతో నానా హంగామా చేస్తుంటారు. మద్యం మత్తులో రెచ్చిపోతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. రాత్రి పూట పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ ఇలాంటివారు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి పోలీసులు ఆపరేషన్ చెబుత్రను చేపడుతుంటారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పోలీసులు ఆపరేషన్ చబుత్రను తిరిగి ప్రారంభించారు. రాత్రి పూట కొంత మంది యువత అదే పనిగా బైక్స్ తో పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకుంటూ కేకలు వేసుకుంటూ అనవసరంగా రచ్చ చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు పోలీసులు. ఇటీవల కొంత మంది యువకులు గంజాయి మత్తులో నానా బీభత్సం సృష్టించారు. ఇలాంటి వారి ఆగడాలు విపరీతం అయ్యాయని నగరంలో పలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఆపరేషన్ తిరిగి మొదలు పెట్టినట్లు తెలిపారు.

రాత్రి సమయాల్లో అనవసరంగా బయట తిరిగే యూత్ కి పోలీసులు గట్టి క్లాస్ పీకుతున్నారు. అంతేకాదు ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడి రోడ్లపైకి వచ్చి హంగామా చేస్తే రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ సార్లు పట్టుబడితే వారి తల్లిదండ్రులను పిలిచి విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. అప్పట్లో పాతబస్తీలో ఆపరేషన్ చబుత్ర చక్కటి ఫలితాలను ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు తిరిగి ఈ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: వరద ముంపు నుండి 1200 మందిని రక్షించిన రియల్ హీరో!
