హైదరాబాద్ నగరంలో కలుషిత నీటి సమస్య కలవర పెడుతోంది. గుట్టల బేగంపేటలో కలుషిత తాగునీటి వల్ల ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తాగునీరు కలుషితం అవుతున్నాయని సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ ఇల్లు కూల్చివేత! పాపం నడి రోడ్డుపై!
మాదాపూర్ గుట్టల బేగంపేట వడ్డెర బస్తీలో కలుషిత తాగునీట సమస్య వల్ల భీమయ్య(27) ప్రాణాలు కోల్పోయాడు. అతని కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీళ్లే కాకుండా.. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వడ్డెర కాలనీ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. అందరికీ చలి, జ్వరం, వాంతులు అవుతున్నట్లు చెబుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. తాగునీటి సమస్య గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల నుంచి నీరు వాసన రావడం, రంగు మారడం జరుగుతోందని చెబుతున్నారు. వాటర్ ఫిల్టర్ కొనుక్కొని తాగాలని సూచించిన అధికారులు.. ఇప్పుడు ఆ నీటితో స్నానం కూడా చేయెద్దని చెబుతున్నారని వాపోతున్నారు.
వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి సమస్యతో ఎక్కువ మంది తమ వద్దకు వస్తున్నట్లు కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండ్ తెలిపారు. కలుషిత ఆహారం లేదా కలుషిత నీటి సమస్య అయి ఉండచ్చని వైద్యులు భావిస్తున్నారు. పిల్లలు తట్టుకోలేకపోతున్నారని, వారికి వైద్యం కొనసాగిస్తున్నామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారికి ఐసీయూ ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఘనటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.