తెలంగాణ రాజ్ భవన్ లో అంగరంగ వైభవంగ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆమె కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేను కొందరికి నచ్చకపోవచ్చు. కానీ నాకు తెలంగాణ ప్రజలు అంటే ఎంతో ఇష్టం అని ఆ ఇష్టంతోనే నాకు పని కష్టమైనా ఇక్కడ గవర్నర్ గా నా విధులు నిర్వర్తిస్తున్నాను అని తమిళసై తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పతాకావిష్కరణ అనంతరం సైనికుల నుంచి గౌరవ వందన స్వీకరించారు తమిళసై.
గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య విభేదాలు వస్తున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళసై పాల్గొన్ని జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఓ దిక్సూచి అని ఆమె అన్నారు. తెలంగాణకు గోప్ప చరిత్ర ఉందన్నారు. అలాగే తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పకుండా ఉంటుంది అని ఈ సందర్భంగా ఆమె చెప్పుకోచ్చారు.
#WATCH | Telangana Governor Tamilisai Soundararajan felicitates #GoldenGlobes award-winning & #Oscars nominated ‘Naatu Naatu’ song’s composer & lyricist – MM Keeravani and Chandrabose – at the #RepublicDay function in Hyderabad. pic.twitter.com/F5WaoWEn4i
— ANI (@ANI) January 26, 2023
ఇక రాష్ట్రంలో నేను కొందరికి నచ్చకపోవచ్చు.. కానీ నాకు తెలంగాణ ప్రజలు అంటే చాలా ఇష్టం తమిళసై అన్నారు. ఇక తెలంగాణలో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు తమిళసై సౌందర రాజన్. రాష్ట్రానికి విశిష్టమైన చరిత్ర ఉందని, అభివృద్ధి అంటే కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు.. జాతి నిర్మాణం అని తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలోని జాతీయ రహదారులకు భారీగా నిధులు ఇస్తున్న ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు గవర్నర్ తమిళసై. అనంతరం పద్మ శ్రీ పురస్కర గ్రహితలను సన్మానించారు. పద్మ శ్రీ అవార్డు గ్రహిత సంగీత దర్శకులు కీరవాణితో పాటు పాటల రచయిత చంద్రబోస్ ను సత్కరించారు. తాాజాగా ఆస్కార్ అవార్డుల్లో నాటునాటు సాంగ్ నామినేట్ అయిన విషయం మనకు తెలిసిందే. మరికొందరికి ప్రశంసా పత్రాలను అందజేశారు. మరి రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Telangana Governor Tamilisai Soundararajan felicitates music director & lyricist – MM Keeravani and Chandrabose @ #RepublicDay celebrations in #Hyderabad#NaatuNaatuForOscars #goldenglobe pic.twitter.com/P1KLzsvXZq
— South Cinemas™ (@SouthCinemas_) January 26, 2023