ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగు లోకి వస్తున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కళాకారులు తమ లాటెంట్ తో ఎంతో మంది ఆడియన్స్ మనసు దోచుకున్నారు. అలాంటి వారిలో ‘గద్వాలబిడ్డ’ ఎస్ మల్లికార్జున్ రెడ్డి ఒకరు. చిన్న వయసులోనే తన దైన డైలాగ్స్ తో ఎంతో మంది మనసు దోచుకున్నాడు. మాట్లాడేది వ్యంగం అయినా.. తన వాయిస్ తో అందరినీ అలరించాడు. చిన్న వయసులో ఎంతో మందిని తనదైన మాటలతో కడుపుబ్బా నవ్వించాడు.
ఇది చదవండి: గద్వాల్ బిడ్డకు వీడ్కోలు.. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు!
గద్వాల్ బిడ్డ మల్లికార్జున్ ఇక లేడు. ఆ మద్య రాంగోపాల్ వర్మ పై కూడా ఈ కుర్రాడు కామెంట్స్ చేస్తూ వచ్చిన వీడియో తెగ వైరల్ అయ్యింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లికార్జున్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తన బాధ నుండి మనందరినీ సంతోషపెట్టిన పిల్లవాడు. సోషల్ మీడియాలో సంచలనం రేపిన చిన్నారి “గద్వాలబిడ్డ”అలియాస్ ఎస్ మల్లికార్జున్ రెడ్డి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. రేపు గద్వాల్ జిల్లా జిల్లెడుదిన్నెలో అంత్యక్రియలు జరగనున్నాయి.