తెలంగాణ టీఆర్‌ఎస్ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనకే సొంతమైన ప్రత్యేక శైలీతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాట తీరు కూడా ఎంత భిన్నంగా ఉంటుందో అందరికి తెలిసిందే. గతంలో పలుమార్లు.. ఆయన తన మాస్ డైలాగ్స్‌తో ప్రజలని అలరించారు. ఇక ఆయనపై వచ్చే వివాదాలకైతే లెక్కేలేదు. ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన సామాజిక వర్గం నుంచే ఊహించని రీతిలో నిరసన సెగ తగిలింది. ఆ వివరాలు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో ఆదివారం సాయంత్రం రెడ్డి సింహగర్జన బహిరంగ సభ జరిగింది. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా నిర్వహించిన ఈ సభలో రెడ్ల జేఏసీ నేతలతో పాటు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి అతిథిగా వచ్చారు. ఆయన ప్రసంగిస్తుండగా, రెడ్డి శ్రేణులకు చెందిన కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వారు ఏమాత్రం శాంతించకపోవడంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని ఆపేశారు.
ఇది కూడా చదవండి: Minister Malla Reddy: వీడియో: సినీ కార్మికులను ఆదుకున్న దేవుడు చిరంజీవి: మంత్రి మల్లారెడ్డి
అయినప్పటికీ సభకు వచ్చిన వారిలో కొందరు రెచ్చిపోవడంతో, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన సభికులు.. మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు, రాళ్లు కాన్వాయ్ పై విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: మాజీ సీఎం చంద్రబాబుతో ముఖ్యమంత్రి కేసీఆర్, వైరల్ అవుతున్న ఫోటోలు
మంత్రి ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి తన కాన్వాయ్ లో వెళ్లిపోతుండగా.. కొందరు కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. మంత్రి కారుపై కుర్చీలు, రాళ్లు, చెప్పులు విసిరారు. కాన్వాయ్ వెంట పరుగులు పెట్టి మరీ దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మల్లారెడ్డి సభకు వచ్చినప్పుడు వాతావరణం అంతా ప్రశాంతంగానే ఉంది. అయితే, ఎప్పుడైతే మంత్రి సభా వేదికపైకి ఎక్కి మైకు పట్టుకుని స్పీచ్ అందుకున్నారో.. అంతే.. ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. కార్యక్రమానికి వచ్చిన వాళ్లంతా మంత్రి తమ సామాజికవర్గానికి సంబంధించిన మాటలు మాట్లాడతారని ఎదురుచూశారు.
కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి టీఆర్‌ఎస్ పాలనలోనే జరిగిందని.. మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పారు. అంతే ఆ ఒక్కమాటతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పదే పదే కేసీఆర్, టీఆర్‌ఎస్ గొప్పల గురించే మాట్లాడుతున్నారని మంత్రి ప్రసంగానికి రెడ్లు అడ్డుపడ్డారు. అంతటితో ఆగక కాన్వాయ్‌పై దాడి చేశారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Kaivalya Reddy: లోకేష్‌ను కలిసిన YSRCP ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కూతురు