ఈ మద్య కొంత మంది డబ్బు ఎంతటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఈజీ మనీ హైటెక్ మోసాలకు పాల్పపడుతున్నారు. దొంగ నోట్ల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. వీటితో పాటు కొంత మంది పక్కా వ్యూహాలతో ఏంటీఎం చోరీలకు పాల్పపడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. పోలీసుకలు తెలిపిన వివరాల ప్రకారం..
కోరుట్ల పట్టణం పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఎస్బీఐ బ్యాంక్ లో శనివారం రాత్రి 2 గంటల సమయంలో దొంగలు చోరీకి ప్రయత్నించారు. కారులో నలుగురు వ్యక్తులు ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎం లోకి చొరబడి తాము తెచ్చుకున్న ఆయుధాలతో పగులగొట్టి అందులో ఉన్న డబ్బు ను చోరీ చేశారు. డబ్బును బ్యాగుల్లో సర్ధి కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఏటీఎం లో అలారం మోగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అటుగా వస్తున్న వాహనాన్ని చూసిన దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. తమ వాహనాన్ని వేగంగా నడపడంతో పోలీస్ జీపు కి డ్యాష్ ఇచ్చారు. ఈ క్రమంలో దొంగలు దోచుకున్న డబ్బు రోడ్డుపై చెల్లా చెదురుగ పడిపోయాయి. దొంగలు కారును వదిలివేసి పారిపోయారు.
దొంగలు పారిపోయే క్రమంలో బ్యాగు నుంచి డబ్బులు రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి. వాటిని పోలీసులు జాగ్రత్తగా సేకరించారు. రోడ్డు పై పడి ఉన్న డబ్బు సుమారు 19 లక్షల 200 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక దొంగతనం, పోలీసుల చేజింగ్ కి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు చోరీకి పాల్పపడిన దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఎస్బీఐ తండ్రియాలా బ్యాంక్ మేనేజర్ గోపిని సంప్రదించగా.. చోరీకి గురైన సొమ్ము పోలీసులు మొత్తం రికవరీ చేసినట్లు తెలిపారు.