పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా పేరొందిన తెలంగాణ మరో ఘనతను సాధించింది. కేవలం అమెరికా, యూరప్‌లలో మాత్రమే ఉన్న అమెజాన్ ఎయిర్.. ఇండియాకు వచ్చింది. అది కూడా హైదరాబాద్ రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెజాన్ ఎయిర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధి ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో పాటు సంస్థ ప్రతి నిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అమెజాన్ ఎయిర్ హైదరాబాద్‌లో ప్రారంభం కావటం వల్ల అమెజాన్ సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. కస్టమర్లకు డెలివరీ ఇవ్వటం మరింత వేగవంతం అవుతుందని తెలిపారు.
నార్త్ అమెరికా, యూరప్ దేశాల్లో కాకుండా మొదటి సారి బయటి దేశాల్లో ఏర్పాటవుతోందని, అది కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు కావటం సంతోషంగా ఉందన్నారు. పెద్దదైన అమెజాన్ ఫుట్ ప్రింట్ ఏషియాలోని హైదరాబాద్‌లో ఉందని చెప్పారు. అమెజాన్‌కు తమ పూర్తి సహాకారం ఉంటుందని, సంస్థ మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. కాగా, చేనేత కార్మికుల చేయూతనివ్వటానికి అమెజాన్ ఎంతో కృషి చేస్తోంది. 56 గ్రామాల్లోని 4500 చేనేత కార్మికులకు సహాయం చేస్తోంది. మరి, కేవలం అమెరికా, యూరప్‌లలో మాత్రమే ఉన్న అమెజాన్ ఎయిర్ హైదరాబాద్‌లో ప్రారంభం కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Amazon’s love story with #Hyderabad continues to grow 😊
❇️ Home to Amazon’s world’s largest Campus
❇️ AWS Data Centre investment of 4.4 Billion USD (₹ 36,600 Crore)
❇️ Largest Fulfilment Centre in Asia
❇️ Today Amazon Air launched in Hyderabad, first outside US & Europe pic.twitter.com/XhGC462s3T
— KTR (@KTRTRS) January 23, 2023