ఈ మధ్యకాలంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి మునుగోడు ఉపఎన్నిక జోరుగా కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్షాలు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో గత రెండు రోజుల క్రితం జరిగిన ఓ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో ఒకసారిగా రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా ఈ ఇష్యూపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు.
బీజేపీ అంటే మొదటి నుంచి విరుచుకుపడే ప్రకాష్ రాజ్.. ఈ వ్యవహారంపై కూడా స్పందించారు. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రాల్లో అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవ వంటి మిగత రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన వైఖరినే ఇప్పుడు తెలంగాణాలోనూ అనుసరించే ప్రయత్నం చేసిందంటూ ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఆ దొంగలకు పని లేదంటూ బీజేపీ పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్.. ఇక్కడ కొత్తగా ఏమీ చేయలేదన్నారు. పక్క రాష్ట్రాల్లో బీజేపీ ఇలాగే చేస్తోందని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ప్రజలు అందరూ గుర్తించాలని ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేశారు.. బీజేపీనో, మోడీనో కాదు.. ఇలాంటి పని ఎవరు చేసినా ప్రజలు, మీడియా గొంతెత్తి ప్రశ్నించాలన్నారు. ఇది తన సొంత అభిప్రాయమని స్పష్టం చేశారు.
ఇంతవరకు ఓ విధంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ ..ట్వీట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జస్ట్ ఆస్కింగ్ ట్యాగ్‌తో.. వాళ్లు పొలిటికల్ సేఫ్టీ కండోమ్స్ అమ్ముతున్నారా? అనే ప్రశ్నను ఆయన సంధించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో లీకైన ఆడియో టేపులకు సంబంధించి.. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందనగా.. ఈ ప్రశ్నను ప్రకాష్ రాజ్ సంధించారు. బీజేపీలో చేరితే ఎలాంటి కేసులుండకుండా చూసుకుంటామని ఆడియోలో వినిపించిన సంభాషణలపై స్పందింస్తూ ట్విట్ చేశారు. రాజకీయ భద్రతా కం*డోమ్‍లు అమ్ముతున్నారా? అని తనదైన శైలిలో వ్యంగ్యంగా ఆయన ట్విట్ చేశారు. ప్రకాశ్ రాజ్ స్పందన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Are they Selling Political safety CONDOMS 🤣🤣🤣🤣#justasking https://t.co/N8dPnxg4y1
— Prakash Raj (@prakashraaj) October 28, 2022