ప్రపంచ దిగ్గజ సంస్థలకు భారతీయులు సీఈవోలుగా బాధ్యతలు స్వీకరించడం కొత్తేం కాదు. ఇప్పటికే గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శాంతను నారాయణ్ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో పేరు చేరింది.
గూగుల్ కు చెందిన వీడియో విభాగమైన యూట్యూబ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలుసు. కంటెంట్ క్రియేటర్స్, వ్లోగర్స్ అంటూ ఎంతోమంది యూట్యూబ్ మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. చాలా తక్కువ సమయంలో యూట్యూబ్ ఒక గొప్ప వ్యవస్థగా ఎదిగింది. ఇప్పుడు అలాంటి ఒక గొప్ప సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ కి ఒక ఇండియన్ అమెరికన్ అయిన నీల్ మోహన్ సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్నారు. అవును ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మూలాలు కలిగిన, భారత సంతతికి చెందిన సీఈవోల జాబితాలోకి నీల్ మోహన్ కూడా చేరారు. తొమ్మిదేళ్లుగా సీఈవోగా ఉన్న సూసన్ వొజిసికి పదవి నుంచి వైదొలగడంతో నీల్ మోహన్ ను సీఈవోగా ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు సీఈవోలుగా కొనసాగుతున్నారు. ఇప్పటికే గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఈసీవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శాంతను నారాయణ్ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్ వచ్చి చేరారు. నీల్ మోహన్ ఒక ఇండియన్- అమెరికన్. ట్విట్టర్ సీఈవోగా చేసిన పరాగ్ అగర్వాల్ ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ సీఈవోగా చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత మళ్లీ ఒక భారత సంతతి వ్యక్తి నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్నారు.
It’s impossible to express in one tweet all that @SusanWojcicki has done for Google and YouTube. Very grateful for your leadership, insights and friendship over the years, and so happy you’re staying on to advise us. Thank you, Susan! https://t.co/eYZENvZ0DY
— Sundar Pichai (@sundarpichai) February 16, 2023
కుటుంబ, ఆరోగ్య సంబంధ, ఇతర ప్రాజెక్టుల దృష్ట్యా సూసన్ వొజిసికి యూట్యూబ్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగినట్లు తెలిపారు. గూగుల్ పేరెంటింగ్ సంస్థ ఆల్ఫాబెట్ లో సూసన్ దాదాపు 25 ఏళ్లు వివిధ పదవులు, బాధ్యతలు నిర్వర్తించారు. 9 సంవత్సరాల పాటు యూట్యూబ్ సీఈవోగా పనిచేశారు. సూసన్ వొజిసికిని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొనియాడారు. సూసన్ ఒక అసాధారణ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు ప్రశంసించారు. మరోవైపు నీల్ మోహన్ కు కూడా సుందర్ పిచాయ్ అభినందనలు తెలియజేశారు. యూట్యూబ్ ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటూ ఆకాంక్షించారు.
Thank you, @SusanWojcicki. It’s been amazing to work with you over the years. You’ve built YouTube into an extraordinary home for creators and viewers. I’m excited to continue this awesome and important mission. Looking forward to what lies ahead… https://t.co/Rg5jXv1NGb
— Neal Mohan (@nealmohan) February 16, 2023
నీల్ మోహన్ ఎవరనే విషయానికి వస్తే.. ఆయన ఒక ఇండియన్- అమెరికన్. నీల్ మోహన్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2008లో గూగుల్ లో చేరారు. 2015లో గూగుల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం, యూట్యూబ్ షార్ట్స్ రూపకల్పనలో నీల్ మోహన్ కీలకపాత్ర పోషించారు. నీల్ మోహన్ దాదాపు 8 ఏళ్లపాటు గూగుల్ కు చెందిన డిస్ ప్లే, వీడియో అడ్వటైజింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవో కావడంపై దిగ్గజాలే కాదు.. భారతీయులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
YouTube – Neal Mohan
Google – Sundar Pichai
Microsoft – Satya Nadella
IBM – Arvind Krishna
Adobe- Shantanu Narayen
Vimeo – Anjali Sood
Starbucks – Laxman Narasimhan
FedEx- Raj Subramaniam
VMWare – Raghu Raghuram
Nikesh Arora – Palo Alto
Kurian Brothers- Google Cloud, NetApp https://t.co/YmOYPfznoK— Chandra R. Srikanth (@chandrarsrikant) February 17, 2023