టెక్నాలజీ పరంగా సోషల్ మీడియా అప్లికేషన్స్ ఎంత యాక్టీవ్ గా ఉంటాయో తెలిసిందే. అందులోను సరికొత్త అప్డేట్స్ అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది వాట్సాప్. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి మారుతున్న జీవన విధానాలకు అనుగుణంగా వాట్సాప్.. యాప్ లో ఎన్నో మార్పులు చేస్తూ వస్తోంది. తాజాగా వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకురానుంది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా.. వాయిస్ మెసేజెస్ పంపేముందు, వాయిస్ కరెక్ట్ గా వచ్చిందా? లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఫోన్ లోని కాంటాక్ట్ కి వాయిస్ మెసేజ్ పెట్టేముందు ప్రివ్యూ చూడచ్చన్న మాట. ఈ మేరకు తాజాగా వాట్సాప్ ఈ అప్డేట్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఒకవేళ మనం పంపే వాయిస్ మెసేజ్ లో ఆడియో సరిగ్గా లేదనుకుంటే.. వెంటనే ఆ వాయిస్ మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు.
ఈ సరికొత్త వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఫీచర్.. యూజర్స్ యొక్క వ్యక్తిగత, గ్రూప్ చాట్లలో కూడా పనిచేస్తుంది. ఈ ఫీచర్ కేవలం Android, iOS లకు మాత్రమే కాకుండా.. వెబ్, డెస్క్ టాప్ లతో సహా అన్ని ప్లాట్ ఫామ్స్ కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సప్ తెలిపింది.
మరి ఈ వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఫీచర్ యాక్టీవేట్ చేయడం ఎలా? అంటే..
వాట్సాప్ చాట్ లోని మైక్రోఫోన్(వాయిస్ రికార్డింగ్) బటన్ పై క్లిక్ చేసి, పైన కనిపించే హ్యాండ్స్-ఫ్రీ రికార్డింగ్ లాక్ వైపు స్లైడ్ చేయాలి. తర్వాత మీకు స్టాప్ బటన్, డిలీట్ బటన్ కనిపిస్తాయి. స్టాప్ బటన్‌ను నొక్కి, ఆపై మీ వాయిస్ మెసేజ్‌ను షేర్ చేయడానికి ముందు ప్లే చేసి వినవచ్చు.
అదే రికార్డు చేసిన మెసేజ్ సరిగ్గా లేదనుకుంటే.. పక్కనే ఉన్న డిలీట్ పై క్లిక్ చేసి తొలగించవచ్చు. తర్వాత కొత్తగా వాయిస్ రికార్డు చేసుకొని మెసేజ్ పంపించుకోవచ్చు. వాట్సాప్ లో టెక్స్ట్ వెర్షన్ లో వాయిస్ మెసేజ్ పంపాలనుకుంటే.. ఈ కొత్త ప్రివ్యూ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ మీ వాయిస్ మెసేజ్ లను పంపే ముందు డ్రాఫ్ట్ లో కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందని వాట్సప్ పేర్కొంది. మీరు కూడా ఈ కొత్త ఫీచర్ ట్రై చేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
