ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది యూజర్ల ఉన్నారు. ఇంకా యూజర్లను పెంచుకునేందు, ఉన్నవారిని ఆకట్టుకునేందుకు నిత్యం అనేక సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఎప్పటికప్పుడు చాటింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లను జోడిస్తున్న వాట్సప్.. ఇతర అన్ని యాప్‌లతో పోల్చితే ముందే ఉంటుంది. తన యూజర్లను ఆకర్షించేందుకు తాజాగా మరొ కొత్త ఫీచర్ ను వాట్సాప్ పరిచయం చేయనుంది. గ్రూపులో ప్రస్తుతం ఉండే సభ్యుల సంఖ్యను రెండింతలు చేయనుంది. దీంతో త్వరలో వాట్సాప్ గ్రూపులోని మెంబర్స్ సంఖ్య భారీగా పెరనుంది.
వాట్సాప్ లోని గ్రూపులు పెద్దవి కానున్నాయి. మరింత మంది సభ్యులు ఒక గ్రూపులో ఉండేందుకు వాట్సాప్ కొత్త ఫిచర్ ను ఏర్పాటు చేసింది. గతంలో ఓ గ్రూపులో గరిష్ఠంగా 256 మందిని సభ్యులుగా చేర్చుకోవచ్చు. కొంత కాలం తరువాత ఆ సంఖ్యను 512కు పెంచారు. తాజాగా ఆ సంఖ్యను 1024కి పెంచనుంది. ఈ విషయాన్ని వాట్సాప్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే బీటాఇన్ఫో వెల్లడించింది. ఇప్పటికే వాట్సాప్ బీటా యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే సాధారణ వినియోగదారులకు ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ మరికొన్ని ఫీచర్ల కూడా అందుబాటులోకి తేనుంది. గ్రూప్ అడ్మిన్ ల కోసం అఫ్రూవల్ సిస్టమ్ ను తీసుకరానుంది. అంటే ఎవరైన గ్రూపులో చేరాలనుకుంటే గ్రూప్ అడ్మిన్ ఓకే చేయాల్సి ఉంటుంది.
గ్రూపులో చేరేందుకు వచ్చిన రిక్వెస్ట్స్ అన్నీ.. ఒక చోట లిస్ట్ లాగా కనిపిస్తాయి. వాటిని గ్రూప్ అడ్మిన్ పరిశీలించి.. సదరు వ్యక్తిని గ్రూపు సభ్యుడిగా చేర్చుకోవాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటాడు. ఒకవేళ సదర వ్యక్తిని గ్రూపులోకి వద్దనుకుంటే వారి రిక్వెస్ట్ ను తిరస్కరించ వచ్చు. అదే విధంగా వాట్సాప్ కాల్ లింక్స్ ఫీచర్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఫీచర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకునే వ్యక్తి కాల్ లింక్ క్రియేట్ చేసి.. వీడియో కాల్ మాట్లాడనుకునే ఇతరులకు పంపాలి. ఆ లింక్ ను క్లిక్ చేస్తే.. నేరుగా ఈ కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొనవచ్చు. అయితే ఇది అంతా జూమ్ , గూగుల్ సమావేశం తరహాలో ఉండనున్నట్లు సమాచారం.
ఇక మరో అద్భుతమైన ఫిచర్ ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ యూజర్లు తమ స్టేటస్ లో ఆడియో మెసేజ్ లను కూడా పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు వీడియో, ఫోటోలు, టెక్ట్స్ వంటివి మాత్రమే స్టేటస్ లో పెట్టుకుని అవకాశం ఉండేది. ఈ కొత్త ఫీచర్ తో ఆడియోను కూడా వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవచ్చు. స్టేటస్ బటన క్లిక్ చేస్తే.. వాయిస్ రికార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి వాయిస్ రికార్ట్ చేసి.. స్టేటస్ గా పెట్టుకోవచ్చు. వీటితో పాటు వాట్సాప్ త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేయనుంది.