ప్రముఖ టెలికాం దిగ్గజ ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతానికి ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్, అన్‌లిమిటెడ్ వాయిస్ ప్యాక్‌లు, మొబైల్ డేటా రీఛార్జ్‌లపై 20 శాతం నుంచి 25 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పెరిగిన ధరలను ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుందని తెలిపింది. దీంతో ఎయిర్ టెల్ సంస్థ తాజా నిర్ణయంతో వినియోగదారులంతా షాక్ గురవుతున్నారు.
అయితే పెరిగిన ధరలు ఎలా ఉన్నాయి? ఎంతెంత ధరలు పెరిగావి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. వాయిస్ ప్లాన్స్ ధర విషయానికొస్తే ప్రస్తుతం రూ.79 ఉండగా పెంచిన తర్వాత రూ. 99కు చేరింది. 50 శాతం అధిక టాక్‌టైం, 200 జీబీ మొబైల్ డేటా, సెకనుకు 1 పైసా వాయిస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ గడువు 28 రోజులు ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎయిర్ టెల్ పెంచిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలపై వినియోగదారులు అయోమయంలో పడ్డారు. ఇక ఎయిర్ టెల్ సంస్థ తాజాగా పెంచిన రీఛార్జ్ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.