స్మార్ట్ ఫోన్లు అందరూ వాడుతారు. అది లేకుండా మేము జీవిచలేము అనుకునే స్థాయికి చేరిపోయారు. అయితే ఈ ఫోన్ల వల్ల అందరూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే ఛార్జింగ్. అవును వాటిని ఛార్జ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ సమయం చాలా తగ్గింది. కానీ, ఈ ఫోన్ వల్ల ఆ సమయం గంటల నుంచి నిమిషాల్లోకి వచ్చేసింది.
స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటూ ఇప్పుడు అంతా స్మార్ట్ అయిపోయింది. అందరూ స్మార్ట్ ఫోన్లే కొనాలని చూస్తున్నారు. చాలామంది నిద్ర లేచిన తర్వాత చూసే మొదటి వస్తువు, రాత్రి పడుకోబోయే ముందు చూలే ఆఖరి వస్తువు కూడా స్మార్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రోజు మొత్తం ఈ రేంజ్ లో స్మార్ట్ ఫోన్ వాడేస్తుంటే.. ఛార్జింగ్ ఉండాలి కదా? చాలా ముఖ్యమైన పని పడినప్పుడే ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది. అయితే ఇక నుంచి అలాంటి ఛార్జింగ్ కష్టాలు, ఉండవు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 9 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అవును మీరు విన్నది నిజమే. ఆ ఫోన్ ధర ఎంత? ఫీచర్లు ఏంటో చూద్దాం.
స్మార్ట్ ఫోన్ అనేది ప్రస్తుతం మనిషిలో ఒక భాగంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా తాము జీవించలేము అనే పిరస్థితికి వచ్చేశారు. కొంతమంది ఈ స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడి ఉపాధి కూడా పొందుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ల వచ్చే ప్రధాన సమస్య ఛార్జింగ్. ఇప్పటికే చాలా కంపెనీలు స్పీడ్ ఛార్జెస్, లైటింగ్ ఛార్జింగ్ అని ఫోన్లు తీసుకొచ్చారు. అయితే వాటికి కూడా ఫోన్ ఫుల్ ఛార్జ్ కావాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు రియల్ మీ తీసుకొచ్చిన ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ మాత్రం కేవంల 9.30 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అవును మీరు విన్నది నిజమే.. కేవలం 9 నిమిషాల్లోనే ఫోన్ 100 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది.
We asked you to guess how long it takes the #240Wcharging #realmeGT3 to charge. Watch the video to see the results.
⚠️ Be warned, it’s gonna blow you away ⚠️
———————–#SpeedtotheMax pic.twitter.com/3C1cvBMi39— realme (@realmeIndia) February 20, 2023
ఈ రియల్ మీ జీటీ3 స్మార్ట్ ఫోన్ 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 250 వాట్స్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తోంది. ఈ ఫోన్ స్పీడ్ ఛార్జింగ్ కి సంబంధించి రియల్ మీ ఓ వీడియో కూడా విడుదల చేసింది. ఆ వీడియో ప్రకారం.. కేవలం 80 సెకన్లలో 0 నుంచి 20 శాతం ఛార్జింగ్ ఎక్కింది. 4 నిమిషాల్లోనే ఫోన్ 50 శాతం ఛార్జ్ అయ్యింది. ఇంక 9.30 నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఈ స్థాయిలో స్పీడ్ ఛార్జింగ్ అయ్యే ఫోన్ కేవలం రియల్ జీటీ3 మాత్రమే అని ఆ సంస్థ వెల్లడించింది. దీని ధర విషయానికి వస్తే.. ఇండియాలో ఈ ఫోన్ రూ.34,500 ఆ రేంజ్ లో వస్తుందని చెబుతున్నారు. తమ ఫోన్ ఛార్జింగ్ స్పీడ్ స్మార్ట్ ఫోన్ రూపు రేఖలను మార్చేస్తుందని ప్రతినిధులు చెబుతున్నారు.
Our 240W fast charging technology is about to disrupt the industry. Get ready to experience #SpeedtotheMax with #realmeGT3. pic.twitter.com/8i7iHZfJMS
— Madhav Sheth (@MadhavSheth1) February 21, 2023