మెటా సంస్థ- ఫెస్ బుక్ గురించి దాదాపుగా ప్రపంచంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఈ సంస్థకు చెందినవే. ఈ మెటా సంస్థ సీఈవో మార్క జుకర్ బర్గ్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫేస్ బుక్- మెటా సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇంతకాలం వారి కంపెనీకి ఉన్న క్రేజ్ ద్వారా వైరల్ అయితే.. ఇప్పుడు మాత్రం లే ఆఫ్స్ ద్వారా మెటా సంస్థ వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కొందరు ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మకం ద్రోహం చేశారంటూ కన్నెర్రజేశారు. స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా కూడా చేయాలంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. అయితే అది ఇప్పుడు జరిగింది కాదులెండి. ఒక రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఘటన.
ఇటీవలి కాలంలో మెటా సంస్థ.. ముఖ్యం ఫేస్ బుక్ లేఆఫ్స్ కారణంగా వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు మరో మార్క్ జుకర్ బర్గ్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో మరోసారి ఈ సంస్థ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2010లో ఉద్యోగులకు జుకర్ బర్గ్ రాసిన ఒక కాన్ఫిడెన్షియల్ ఈ-మెయిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఫేస్ బుక్ సంస్థ తమ సొంత మొబైల్ ఫోన్ తయారీలో ఉందని టెక్ క్రంచ్ అనే సంస్థ కథనం ప్రచురించింది. అప్పుడు ఆ కథనానికి స్పందనగా 2010లో జుకర్ బర్గ్ తమ ఉద్యోగులకు ఒక ఇ-మెయిల్ ని పంపారు. అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
జుకర్ బర్గ్ ఆ వార్తను ఖండించడమే కాకుండా.. ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికల విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు టెక్ క్రంచ్ కథనంపై కూడా జుకర్ బర్గ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ పని చేసింది ఎవరైనా తక్షణమే స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ కోరారు. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆ పని చేసింది ఎవరో తామే కనుక్కుంటాం అంటూ హెచ్చరించారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సమయంలో తాను అసలు సొంత ఫోన్ తయారీ గురించి మాట్లాడలేదంటూ వ్యాఖ్యానించారు. కంపెనీ అంతర్గత విషయానలు ఇలా లీక్ చేయడం కచ్చితంగా నమ్మక ద్రోహం కిందకే వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ పాత ఇ-మెయిల్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు నిజంగానే ఫేస్ బుక్ నుంచి సొంత ఫోన్ వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.