తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి మరో ప్రయోగం విజయవంతం అయ్యింది. చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లే వాహకనౌకను విజయంవంతంగా నింగిలోకి పంపింది.
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మరో ఉపగ్రహం విజయంవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఈ ప్రయోగం విజయవంతమైంది. చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్లే ఎస్ఎస్ఎల్వీ-డీ2 ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీని ద్వారా 3 చిన్న ఉపగ్రహాలను భూసమీప కక్షలో ప్రవేశపెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమవగా.. ఉదయం 9.18 గంటల సమయంలో ఎస్ఎస్ఎల్వీ-డీ2 నింగిలోకి దూసుకెళ్లింది.
సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2 ద్వారా 3 ఉపగ్రహాలను భూసమీప కక్ష్యలో ప్రవేశ పెట్టింది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు షార్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ వాహన నౌక ద్వారా ఇస్రోకి చెందిన 156.3 కిలోల ఈవోఎస్-07 ఉపగ్రహం, 11.5 కిలోల బరువున్న యూఎస్ఏ అంటారిస్ సంస్థకు చెందిన జానుస్-1, 8.7 కిలోల బరువున్న ఆజాదీ శాట్-2ని కక్ష్యలో ప్రవేశ పెట్టారు.
ఉదయం 9.18 గంటలకు షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన #SSLV-D2. భూసమీప కక్ష్యలో 3 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశ పెట్టిన #ISRO.#SDSC-SHAR #TeluguNews #SumanTV
— SumanTV (@SumanTvOfficial) February 10, 2023
ఆజాదీశాట్-2కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఉపగ్రహాన్ని చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు తయారు చేశారు. ప్రయోగం ప్రారంభమైన 785 సెకన్లకు 450 కిలోమీటర్ల ఎత్తులో ఈవోఎస్-07ని, 880 సెకన్ల వ్యవధిలో జానుప్-1, ఆఖరిగా 900 సెకన్ల సమయం వద్ద ఆజాదీశాట్-2ని కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల దేశవ్యాప్తంగా ఇస్రో, సతీశ్ ధావన్ స్పేస్ స్టేషన్ శాస్త్రవేత్తలను ప్రశంసిస్తున్నారు.
#ISRO launches Small Satellite Launch Vehicle #SSLVD2 carrying EOS-07and 2 co-passenger satellites
Janus-1and AzaadiSAT-2 into 450km circular orbit pic.twitter.com/f6wxLLnGVJ— All India Radio News (@airnewsalerts) February 10, 2023