వన్‌ప్లస్ బ్రాండ్ అంటే.. భారతీయులకు ఎక్కడ లేని మక్కువ. పేరుకు చైనీస్ బ్రాండ్ అయినా.. స్వదేశీ బ్రాండ్ అన్నట్లుగా ఇష్టపడతారు. అందులోనూ వన్‌ప్లస్.. ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు, స్మార్ట్ టీవీలకు పెట్టింది పేరు. తక్కువ ధరలో వన్‌ప్లస్ ప్రాడక్టు ఏదైనా వస్తోంది అంటే.. ఎవరు మిస్ చేసుకోరు. అందుకే.. ఈ ఆఫర్ వివరాలు మీకు తెలియజేస్తున్నాం..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీలపై 75% వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ఆగష్టు 6 నుంచి 10 వరకు ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో నిర్వహిస్తోన్న ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, టీవీలు, ఆడియో డివైజ్‌లు.. ఇలా అన్ని వస్తువులు తక్కువ ధరకే లభించనున్నాయి. ఎంఐ, శాంసంగ్, సోనీ, మోటోరోలా, టీసీఎల్, థామ్సన్.. ఇలా అన్ని కంపెనీల స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ సేల్ లో ముఖ్యంగా వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీపై భారీ తగ్గింపు ఉంది.
వన్‌ప్లస్ 32 ఇంచెస్ Y సిరీస్ – (ధర, ఆఫర్)
భారత మార్కెట్ లో వన్‌ప్లస్ 32 ఇంచెస్ Y సిరీస్ అసలు ధర రూ. 19,999గా ఉంది. ఇండిపెండెన్స్ డే సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్.. దీనిపై 32% డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో రూ.13,499కే అందుబాటులోకి వస్తోంది. అంతేకాకుండా.. కొనుగోలు సమయంలో ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగించినట్లైతే.. రూ.2,000 అదనపు తగ్గింపు లంభిస్తుంది. దీంతో 11,499కే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.
అసలు ధర: రూ. 19,999; ఆఫర్ ధర: రూ. 13,499; డిస్కౌంట్: రూ. 6,500 (32% Off); ఐసీఐసీఐ ఆఫర్: రూ. 2,000
OnePlus Y1 80 cm (32 inch) HD Ready LED Smart Android TV with Dolby Audio.. pic.twitter.com/4RxawD8fSM
— Govardhan Reddy (@gova3555) August 8, 2022
ఇదీ చదవండి: Xiaomi 12 Pro: ఇండిపెండెన్స్ డే సేల్: షావోమీ 12 ప్రో పై రూ. 13,000 డిస్కౌంట్!
ఇదీ చదవండి: OnePlus: వన్‌ప్లస్ 10టీ 5జీపై బంపరాఫర్.. ఏకంగా రూ. 6,000 డిస్కౌంట్!