చాట్ డీపీటీ.. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగాన్ని ఈ ఏఐ బేస్డ్ సాఫ్ట్ వేర్ ఒక ఊపు ఊపుతోంది. ఎక్కడ చూసినా ఈ చాట్ జీపీటీ గురించే ప్రస్తావన, చర్చ, వాడకం కూడా. నవంబర్ 2022లో దీనిని విడుదల చేయగా.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 100 మిలియన్ యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. అంటే టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ను వెనక్కి నెట్టి రికార్డలు బద్దలు కొట్టింది. చాట్ జీపీటీ క్రేజ్ చూసి గూగుల్, ఫేస్ బుక్ లాంటి బడా సంస్థలు కూడా గగ్గోలు పెట్టాయి. అయితే దాని నుంచి తేరుకుని గూగుల్ చాట్ జీపీటీకి షాకిచ్చేందుకు సిద్ధమైపోయింది. అందుకు తగిన కార్యచరణ కూడా దాదాపు పూర్తైనట్లు చెబుతున్నారు.
గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. గూగుల్ సంస్థ ఏఐ బేస్‌డ్ చాట్ బాట్ ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. బార్డ్ అనే ఏఐ బేస్‌డ్ చాట్ బాట్ ను తీసుకొచ్చారు. ఇది లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్(LaMDA) ఆధారంగా పనిచేస్తుంది. ఈ LaMDAని రెండేళ్ల క్రితం గూగుల్ ప్రారంభించింది. ప్రస్తుతం టెస్టర్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చారు. వారి ఫీడ్ బ్యాక్, సలహాలను ఉపయోగించుకుని ఈ బార్డ్ ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. గూగుల్ తీసుకొచ్చిన ఈ బార్డ్ తప్పకుండా మైక్రోసాఫ్ట్ ఫండింగ్ తో వచ్చి చాట్ జీపీటీకి పెద్ద పోటీ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
టెక్ ప్రపచంలో చాట్ జీపీటీ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఓపెన్ ఏఐ బేస్‌డ్ చాట్ బాట్ గుంరిచి లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు గూగుల్ దానినికి పోటీగా లేదా దానిని అధిగమించేలా బార్డ్ ని అభివృద్ధి చేయగలదా అనేదే ప్రశ్న. ఎందుకంటే చాట్ జీపీటీ ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు చాట్ జీపీటీపై కూడా వ్యతిరేకత ఉంది. దీని వల్ల ఉద్యోగాలు, పిల్లల చదువులు దెబ్బతింటాయని ఆరోపిస్తున్నారు. మరి.. అలాంటి సాఫ్ వేర్ ని తీసుకొస్తే గూగుల్ దానిపై కూడా వ్యతిరేకత రాదా? వస్తే ఎలా తీసుకుంటుంది? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి చాట్ జీపీటీతో పోటీ పడేందుకు గూగుల్ సిద్ధమైన విషయం ఇప్పుడు అధికారికం అయ్యింది. చాట్ జీపీటీ ప్లస్ సేవలను అమెరికాలో పొందాలంటే దాదాపు నెలకు 20 డాలర్లు చెల్లించాలి. అంటే నెలకు దాదాపు రూ.1,600 అనమాట. మరి గూగుల్ తీసుకొచ్చే ఈ బార్డ్ చాట్ బాట్ ని ఉచితంగా అందిస్తారా? లేక దీనికి కూడా నెలకు ఇంత అని వసూలు చేస్తారా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. గూగుల్ ఈ ఒక్క ఏఐ బేస్‌డ్ బాట్ మీదే కాదు ఇంకా చాలా ప్రాజెక్టులపై పని చేస్తోంది. చాలా వాటిలో కోట్లలో పెట్టుబడులు కూడా పెట్టింది. గూగుల్ క్లౌడ్ పార్టనర్ షిప్స్ ద్వారా ఏఐతో పనిచేసే సాఫ్ట్ వేర్స్, బాట్స్ పై పెట్టుబడులు పెడుతోంది. ఆంథ్రోపిక్ అనే ఏఐ సిస్టమ్ పై గూగుల్ సంస్థ దాదాపు రూ.3,299 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
2/ Bard seeks to combine the breadth of the world’s knowledge with the power, intelligence, and creativity of our large language models. It draws on information from the web to provide fresh, high-quality responses. Today we’re opening Bard up to trusted external testers. pic.twitter.com/QPy5BcERd6
— Sundar Pichai (@sundarpichai) February 6, 2023