ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్.. ప్రస్తుతం మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. అలాగే ఈ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 మొబైల్‌ను రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్‌ను వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్‌పై ప్రస్తుతం ఉన్న ఆఫర్లు ఏంటో చూడండి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 (4జీబీ ర్యామ్ + 64జీబీ) స్టోరేజ్ అసలు ధర రూ.14,999గా ఉంది. అయితే సేల్ సందర్భంగా రూ.4,000 డిస్కౌంట్‌తో రూ.10,999కు ఈ మొబైల్ అందుబాటులో ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే మరో రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ మొబైల్‌ను రూ.9,999కే దక్కించుకోవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరింత తక్కువ ధరకే ఈ మొబైల్ ను సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్‌కు ఇచ్చే పాత ఫోన్ మోడల్, కండీషన్‌ను బట్టి ఆఫర్ లభిస్తుంది. గరిష్టంగా రూ.10,450 వరకు ఎక్స్చేంజ్‌ను పొందే అవకాశం ఉంది.
Guys agar aap 10,000 rupees mei ek badiya smartphone search kar rahe the to Samsung F22 abhi under 10k milraha Axis bank ke credit card pe mast deal hai. 😍
Mere pass personal bhi hai yeh phone.
#Flipkart pic.twitter.com/tMmA3vIzZ6— Geek Abhishek (@geekabhishek_) April 23, 2022
ఇక.. ఇదే మోడల్ (6జీబీ ర్యామ్+128జీబీ) వేరియంట్‌పై కూడా ఈ ఆఫర్ ఉంది. ఈ వేరియంట్ అసలు ధర రూ.16,999కాగా ఆఫర్ లో భాగంగా 12,999కే అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డు ఆఫర్‌తో కలిపి రూ.11,999కు దక్కించుకోవచ్చు.
శాంసంగ్ గ్యాలాక్సీ ఎఫ్22
6.4 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్‌ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్
మీడియా టెక్ హీలియో G80 ప్రాసెసర్
48ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+ 2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా
13 ఎంపీ ఫ్రంట్ కెమెరా
6,000mAh బ్యాటరీ
Samsung Galaxy F22 – Full Specifications & launch date
– Helio G80 soc
– 6.4 inch 720p S Amoled display
– 13mp 🤳
– 48 + 8 + 2 + 2mp rear 📸
– 6000 mah 🔋, 15 watt 🔌
– Android 11
6 July , 2021#F22 #GalaxyF22 #SamsungF22 #Samsung #SamsungGalaxyF22 pic.twitter.com/e6gPZaQcTG— Anand (@AnandTech15) July 1, 2021
ఇది కూడా చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకి బిగ్ షాక్.. గూగుల్ కీలక నిర్ణయం!