ఎలన్ మస్క్.. ఈ ప్రపంచ కుబేరుడి గురించి చాలా మందికి బాగానే తెలిసి ఉంటుంది. ఆయన ఏం చేసినా, ఏం ట్వీట్ చేసినా ఒక వివాదం అయి తీరుతుంది. కొన్నిసార్లు ఆయన ట్వీట్లను డీకోడ్ చేయడం కూడా చాలా కష్టం. అయిలే ఎలన్ మస్క్ ఎప్పుడూ తన చర్యలపై పశ్చాతాప పడింది లేదు.
ట్విట్టర్.. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ, యూజర్ల గురించి అందరికీ తెలిసిందే. షార్ట్ అండ్ స్వీట్ గా సమాచారాన్ని చేరవేయడానికి, సెలబ్రిటీలు అభిమానులతో తమ ఆలోచనలను పంచుకోవడానికి, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు తమ నిర్ణయాలను ప్రజలకు చేరవేయడానికి ఈ ప్లాట్ ఫామ్ ని వాడుతున్నారు. అయితే ఇటీవల ఈ సంస్థను ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సంస్థలో జరిగే ప్రతి విషయం, వాళ్లు తీసుకునే ప్రతి నిర్ణయం వివాదాస్పదం అవుతూనే వచ్చింది. ట్విట్టర్ బ్లూ టిక్ కోసం డబ్బులు కట్టాలంటూ కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మెటా కూడా అదే దారిలోకి వచ్చింది.
అయితే ఎలన్ మస్క్ విషయంలో అందరికీ ఒకింత అసహనం, అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ఆయన స్థాయికి ఒక్కోసారి ఆయన చేసే కామెంట్స్, చేస్ వ్యాఖ్యలకు అస్సలు సంబంధం ఉండదు. ఆయన ఏం చేసినా, ఏం చెప్పినా వివాదాస్పదంగానే అనిపిస్తాయి. అయితే ఎలన్ మస్క్ ఇప్పుడు ట్విట్టర్ యూజర్లకు క్షమాపణలు చెప్పారు. తమ సంస్థ వల్లే పొరపాటు జరిగింది అంటూ ట్వీట్ చేశారు. అందుకు ట్విట్టర్ యూజర్లు తమని మన్నించాలంటూ సారీ చెప్పారు. ఆ తప్పు ఏంటి? ఎందుకు సారీ చెప్పారు? అనే ప్రశ్నల కంటే కూడా అసలు ఎలన్ మస్క్ సారీ చెప్పడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి ఎలన్ మస్క్ సారీ చెప్పింది ఆయన చేసే పనులకు సంబంధించి కాదులెండి. ట్విట్టర్ సంస్థ వల్ల జరిగిన ఒక చిన్న పొరపాటుకు సంబంధించి యూజర్లకు మస్క్ క్షమాపణ చెప్పారు. విషయం ఏంటంటే.. అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో యాడ్స్ వస్తాయని అందరికీ తెలిసిందే. అలాగే ట్విట్టర్ లో కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య ట్విట్టర్ లో అస్సలు పొంతన లేకుండా, సంబంధం లేకుండా యాడ్స్ వచ్చాయంట. అలా రావడం తమ పొరపాటే, ఇంక అలా జరగదు అంటూ ఎలన్ మస్క్ సారీ చెప్పారు. గూగుల్ తరహాలోనే టెక్నాలజీని ఉపయోగించే రిలవెంట్ యాడ్స్ మాత్రమే వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎలన్ మస్క్ క్షమాపణలు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.