ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకే మార్కెట్ లో పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా సరికొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు స్కూటీ మోడల్స్ వచ్చాయి. ఆ తర్వాత బైక్ మోడల్ లో కూడా ఈవీ బైక్స్ వచ్చాయి. ఇప్పుడు సరికొత్తగా గేర్లతో కూడిన ఈవీ బైకులు రాబోతున్నాయి.
ఎలక్ట్రికల్ వెహికల్.. ప్రస్తుతం మార్కెట్ లో వీటికి డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో తమవంతు భాగస్వాములు అయిన వారు కూడా అవుతారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్ వాడకం వల్ల ఖర్చులు కూడా తగ్గుతాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం కూడా తగ్గుతుంది. పైగా సాధారణ వాహనాలతో పోలిస్తే.. ఈవీ వెహికల్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ వంటి ఛార్జెస్ పై కూడా తగ్గింపులు ప్రకటించాయి. ఇప్పుడు ఈవీ బైక్స్ లో స్కూటీలు మాత్రమే కాకుండా.. బైక్ మోడల్స్ కూడా వస్తున్నాయి.
ఎన్ని మోడల్స్ వచ్చినా కూడా ఇంకా చిన్న వెలితి ఉంది అంటున్నారు వినియోగదారులు. అదే అండి గేర్లు లేకపోవడం. ఇప్పుడు ఆ చిన్న గ్యాప్ ని కూడా ఈ ‘మ్యాటర్’ కంపెనీ ఫిల్ చేసేసింది. ఎలా అంటే మ్యాటర్ అనే స్టార్టప్ ఇప్పుడు గేర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైక్ తీసుకురాబోతోంది. బుధవారం హైదరాబాద్ లో మ్యాటర్ కంపెనీకి చెందిన ‘ఎరా’ బైక్ ని ఆవిష్కరించారు. యూత్ ని ఆకట్టుకునేందుకు గేర్లు, స్పోర్టీ లుక్ లో ఈ బైక్ తీసుకురానున్నట్లు చెబుతున్నారు. అహ్మదాబాద్ లో ఉన్న మ్యాటర్ తయారీ కేంద్రంలో నెలకు 60,000 వాహనాలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.
ఇంక ఈ ఈవీ బైక్ విషయానికి వస్తే.. దీనిలో ఎరా 4000, ఎరా 5000, ఎరా 5000+ వేరియంట్లు ఉండనున్నట్లు తెలియజేశారు. ఈ బైక్ లో గేర్లు ఉండటం మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలో బ్యాటరీ, ఇంజిన్ వేడెక్కకుండా ప్రత్యేకమైన సాంకేతికతను వాడామన్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. కేవలం 5 గంటల్లోనే ఈ బైక్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టైమ్ 2 గంటలు. దీనిలో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ టెక్నాలజీ ఉంది. అలాయ్ వీల్స్, ఎల్ఈడీ లైట్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ అవుతాయని చెప్పారు. ధర విషయానికి వస్తే.. షోరూమ్ ప్రైస్ రూ.1,43,000, రూ.1,53,000 వరకు ఉండచ్చని చెప్పారు.