తక్కువ ఖర్చు, సబ్సిడీలు, పర్వావరణ పరిరక్షణ ఇలా కారణం ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. డిమాండ్ కి తగ్గట్లు చాలా కంపెనీలు ఈవీ వాహనాలను తయారు చేయడం ప్రారంభించాయి. ఇప్పటివరకు స్కూటీ మోడల్ లో ఈవీ ద్విచక్రవాహనాలు వచ్చాయి. ఇప్పుడు బైక్ తరహాలో స్పోర్ట్స్ లుక్స్ లో ఓ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి వచ్చింది.
ఎలక్ట్రిక్ వాహనాలకు దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్ ఏంటో అందరికీ తెలుసు. కొత్తగా వాహనాలు కొనాలి అనుకునే వారు మాత్రం దాదాపుగా ఈవీ వాహనాలే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే వాటిలో మరీ ముఖ్యంగా ద్విచక్రవాహనాలు అయితే ఈవీకే మొగ్గు చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈవీ వాహనాల వాడకం పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి. అయితే ఇప్పటికీ చాలామంది ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకంటే వారు స్కూటీ కాకుండా బైక్ కావాలి అనుకోవడమే. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక సూపర్ బైక్ అందుబాటులోకి వచ్చింది.
సాధారణంగా చాలామంది యువత ఎలక్ట్రిక్ బైక్ తీసుకోకపోవడానికి కారణం ఒకటే. అవి స్కూటీల మోడల్స్ లో వస్తున్నాయి. బైక్ లుక్స్ లో రావడంలేదు. అయితే అలాంటి వారికోసం ఈ సూపర్ బైక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇది లుక్స్ లో అచ్చు ఓల్డ్ కరీజ్మా తరహాలో ఉంది. ఇంక ఫీచర్లు కూడా అదిపోయాయి. ఈ సూపర్ బైక్ ని జాయ్ ఈ-బైక్ కంపెనీ తయారు చేసింది. ఈ మోడల్ పేరు థండర్ బోల్ట్. లుక్స్ మాత్రమే కాదు.. ఫీచర్లు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనిలో 5000 వాట్స్ పవర్ కలిగిన డీసీ బ్రష్ లెస్ హబ్ మోటర్ ఉంది. ఇందులో ఉండే లీథియమ్ అయాన్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 9 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 110 కిలో మీటర్ల రేంజ్ వరకు ప్రయాణించవచ్చు.
ఈ బైక్ లో ఫ్రంట్ డబుల్ డిస్క్, బ్యాక్ సింగిల్ డిస్క్ ఉంటుంది. గంటకు అత్యధికంగా 90 కిలోమీటర్ల వేగంతా ప్రయాణించగలదు. దీనిలో ఐవోటీ సెన్సార్స్ ఉన్నాయి. వీటి ద్వారా మొబైల్ యాప్ సాయంతో మీ బైక్ ని ఎవరైనా దొంగిలిస్తే అది ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు. ఈ బైక్ బ్యాటరీ ఫుల్ అవడానికి కేవలం 6 యూనిట్ల విద్యుత్ సరిపోతుందంటున్నారు. అంటే కిలోమీటరుకు కేవలం 40 పైసల ఖర్చు మాత్రమే అవుతుందని చెబుతున్నారు. అలాగే ఈ బైక్ లో ఓవర్ ఓల్టేజ్, టెంపరేచర్, షార్ట్ సర్క్యూట్ ప్రొటేక్షన్ వంటి ఫీచర్ కూడా ఉంది. ఇంక హైడ్రాలిక్ సస్పెన్షన్ కూడా ఈ సూపర్ బైక్ లో ఉంది.
ఈ బైక్ ధర విషయానికి వస్తే.. రూ.2,33,000గా నిర్ణయించారు. బైక్ లుక్స్, ఫీచర్స్ చూస్తే ఆ మాత్రం ధర ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునేవారు జాయ్ ఈ-బైక్ అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ తరహా లుక్స్ లో 110 కిలోమీటర్ల రేంజ్ లో బైక్ రావడం అంటే మంచి విషయం అంటూ అభిప్రాయపడుతున్నారు. ఈ థండర్ బోల్ట్ బైక్ లుక్స్ కి యువత ఆకర్షితులవుతున్నారు. ధర కాస్త బడ్జెట్ లో ఉంటే మరింత ఆదరణ లభిస్తుంది అంటున్నారు. స్కూటీ కాకుండా బైక్ తరహాలో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బాగా నచ్చుతుందంటున్నారు.