ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా అంతగా జరగన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఈ తరుణంలో క్రిస్మస్ పర్వదినం సందర్బంగా నథింగ్ సీఈవో కార్ల్‌పీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బెస్ట్ మీమ్ షేర్ చేసిన వారికి నథింగ్ స్మార్ట్‌ఫోన్(1) ఉచితం అంటూ కార్ల్ పీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది.
వన్‌ప్లస్ కో ఫౌండర్ ‘కార్ల్ పీ’ స్థాపించిన ‘నథింగ్’ కంపెనీ నుండి తొలి స్మార్ట్‌ఫోన్ విడుదలైన సంగతి తెలిసిందే. ‘నథింగ్ ఫోన్ (1)’ గా యూనిక్ డిజైన్ తో వచ్చిన ఈ మొబైల్.. స్మార్ట్ ఫోన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్.. దానికి గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన LED స్ట్రిప్ లైట్స్. కాల్స్ వచ్చినప్పుడు, చార్జింగ్ పెట్టినప్పుడు, నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాక్ ప్యానెల్ లైట్స్.. బ్లింక్.. బ్లింక్ అంటుంటే ఆ మజాయే వేరు. కాకుంటే.. ధర రూ. 30,000 పైబడి ఉండడంతో కొందరు వెనకడుగు వేస్తున్నారు.
This Trio Is Nothing 🔴⚪🔥🔥
In Love #Transparent @nothing @getpeid @buildingnothing pic.twitter.com/d7qIH9RSqB— Adarsh (@Danameisadarsh) November 30, 2022
ఈ నేపథ్యంలో నథింగ్ ఫోన్ (1)ను ఉచితంగా సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.. కార్ల్ పీ. క్రిస్మస్ పర్వదినం సందర్బంగా.. ‘బెస్ట్ మీమ్ షేర్ చేసిన వారికి నథింగ్ స్మార్ట్‌ఫోన్(1) ఉచితం అంటూ ట్వీట్ చేశారు. “రాబోయే 24 గంటల్లో వచ్చే బెస్ట్ మీమ్‌కి నథింగ్ ఫోన్ (1)..” అంటూ కార్ల్ పీ ట్వీట్ చేశారు. మీరు.. మీమ్స్ ప్రియులైతే మంచి మీమ్ పోస్ట్ చేసి ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. మీమ్స్ క్రియేట్ చేయడంలో.. మీ టాలెంట్ ఏంటన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I’m feeling 🎅
Best meme in the next 24 hrs gets a Nothing Phone (1)
— Carl Pei (@getpeid) December 16, 2022
— Carl Pei (@getpeid) December 16, 2022