SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Aluminium Air Battery Vehicles That Do Not Require Electricity Or Charging

కరెంటు, ఛార్జింగ్ అవసరమే లేని బ్యాటరీ వాహనాలు.. 500 కి.మీ. మైలేజ్..

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 24 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కరెంటు, ఛార్జింగ్ అవసరమే లేని బ్యాటరీ వాహనాలు.. 500 కి.మీ. మైలేజ్..

వాతావరణ కాలుష్యంతో పాటు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి బయటపడడానికి విద్యుత్ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకుంటున్నారు వాహనదారులు. అయితే కొన్నాళ్ళకు విద్యుత్ వినియోగం పెరిగిపోయి.. ఆ కరెంట్ ధరలు కూడా చుక్కలు చూపించే అవకాశం లేకపోలేదని ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూడని వాళ్ళు ఉన్నారు. దీనికి తోడు అస్తమానూ ఛార్జింగ్ పెట్టుడు, తీసుడు ఈ టెన్షన్ అంతా ఎవరు పడతారు అని చెప్పి కొనడానికి ఆసక్తి చూపించనివాళ్ళూ లేకపోలేదు. పైగా లిథియం బ్యాటరీలు పేలిపోతుందేమో అన్న భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో భద్రతకు భద్రత, కాలుష్యం లేకుండా.. ఛార్జింగ్ తో అస్సలు పని లేకుండా.. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నట్టు.. ఖాళీ గ్యాస్ సిలిండర్ నిచ్చి కొత్త గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్లినట్టు.. ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని ఇచ్చి కొత్త బ్యాటరీని పట్టుకెళ్ళేలా ఒక సరికొత్త బ్యాటరీని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆ బ్యాటరీ పేరు అల్యూమినియం ఎయిర్ బ్యాటరీ. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్యాటరీలతో పోలిస్తే ఈ బ్యాటరీ అధిక మైలేజ్ నిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశోధన విభాగం డైరెక్టర్, కంపెనీ బోర్డు సభ్యుడు డాక్టర్ ఎస్ఎస్వీ రామ్ కుమార్ ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ బ్యాటరీల తయారీ కోసం విదేశాల మీద ఆధారపడక్కర్లేదని, దిగుమతులతో పని లేకుండా.. పూర్తిగా స్వదేశంలో దొరికే అల్యూమినియమే ఈ సరికొత్త విప్లవానికి అస్త్రమని ఆయన అన్నారు. ఈ బ్యాటరీకి కరెంటు అవసరం లేదని.. రీఛార్జ్ చేయాల్సిన పని లేదని, పేలుతుందేమో అన్న భయం అస్సలు అవసరం లేదని అన్నారు.

ఛార్జింగ్ తగ్గినప్పుడు పెట్రోల్ బంకులు లేదా అవుట్ లెట్లలో బ్యాటరీ ఇచ్చి.. మరొక బ్యాటరీని కొంత డబ్బు చెల్లించి తీసుకెళ్లవచ్చునని, దీనికి ఎంతో సమయం పట్టదని, నిమిషాల్లో అయిపోతుందని అన్నారు. ఖాళీ వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చి.. ఎలా అయితే ఫిల్ చేసిన గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్తారో.. అలా ఈ ఖాళీ బ్యాటరీ ఇచ్చి.. కొత్త బ్యాటరీని  తీసుకెళ్ళవచ్చునని తెలిపారు. అయితే కొనుగోలు చేసినప్పుడు బ్యాటరీ లేకుండా కార్ల కంపెనీలు కార్లను విక్రయిస్తాయని, అయితే బ్యాటరీ కోసం డిపాజిట్ చెల్లించి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వంట గ్యాస్ సిలిండర్ కు డిపాజిట్ చెల్లించినట్లు.. ఈ బ్యాటరీలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని.. అయితే డిపాజిట్ ఎంత? మార్చుకున్న ప్రతిసారి ఎంత చెల్లించాలి? అనేది ఇంకా ఖరారు చేయలేదని అన్నారు.

Aluminum Air Battery

లిథియం బ్యాటరీ ఖర్చుతో పోలిస్తే.. ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీతో నడిచే వాహన నిర్వహణ ఖర్చు 50 శాతం తగ్గుతుందని అన్నారు. తొలి దశ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీలు 2024 చివరికల్లా అందుబాటులోకి వస్తాయని.. అప్పుడే అల్యూమినియం బ్యాటరీతో నడిచే వాహనాలు కూడా వస్తాయని అన్నారు. మైలేజ్ విషయానికొస్తే.. పరిశోధనలు తుది దశలో ఉన్నాయని.. రీసెంట్ గా మూడు చక్రాల వాహనానికి అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని ఫిక్స్ చేసి నడపగా.. అది 450 కి.మీ. ప్రయాణించిందని అన్నారు. ఇక ఇదే వాహనాన్ని లిథియం బ్యాటరీతో నడిపితే 80 నుంచి 100 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చిందని అన్నారు. అల్యూమినియం ఎయిర్ బ్యాటరీతో నడిచే వాహనాల కోసం.. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

టాటా కార్లకు అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని అమరిస్తే.. 500 కి.మీ. కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలిగే సామర్థ్యాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించామని అన్నారు. మారుతీ, మహీంద్రా కంపెనీలు కూడా ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తున్నాయని, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం లిథియం బ్యాటరీలను అధికంగా.. చైనా, జపాన్, వియత్నాం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే దిగుమతులపై ఆధారపడకుండా.. మన దేశంలో దొరికే సహజ వనరులతో బ్యాటరీని తయారుచేయడంపై చేసిన అధ్యయనంలో అల్యూమినియం కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించినట్లు ఆయన తెలిపారు.

ఆ అల్యూమినియం నిక్షేపాలు మన దేశంలో ఉండడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టపడుతుందని అన్నారు. ఈ విషయం భారత ప్రభుత్వానికి చెబితే సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. లిథియం బ్యాటరీలో ఎనర్జీ డెన్సిటీ కిలోకు 4 కిలోవాట్లు ఉంటే.. అల్యూమినియం బ్యాటరీలో 8 కిలోవాట్లు ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికైతే 4 కిలోవాట్ల ఎనర్జీ డెన్సిటీనే వెలికితీస్తున్నామని.. దీన్ని మరింత మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని అన్నారు. ఇజ్రాయెల్ కు చెందిన ఫినర్జీ అనే అంకుర సంస్థతో కలిసి పరిశోధన చేస్తున్నట్లు వెల్లడించారు. ఎనర్జీ డెన్సిటీ పెరిగే కొద్దీ మైలేజ్ బాగా పెరుగుతుందని.. 6 నుంచి 7 కిలోవాట్లకు ఎనర్జీ డెన్సిటీ పెరిగితే.. మైలేజ్ 800 కిలోమీటర్లు ఇస్తుందని తెలిపారు.

Aluminum Air Battery

అదే జరిగితే.. వాహన రంగంలో ఇదొక విప్లవం అవుతుందని అన్నారు. ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని వాహనాల్లో ఉపయోగించినప్పుడు అది యాక్టివ్ అల్యూమినియం ట్రైయాక్సయిడ్ గా మారుతుంది. దాన్నుంచి మళ్ళీ అల్యూమినియంను తయారు చేసుకోవచ్చునని అన్నారు. ఈ పునరుత్పత్తి కోసం హిండాల్కోతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. ఇంతకీ ఈ రామ్ కుమార్ ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంకు చెందిన వ్యక్తి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్సెస్సీ కెమిస్ట్రీ చదివారు. ఐఐటీ, రూర్కీ నుంచి డాక్టరేట్ పట్టా పొందిన ఈయన.. 3 దశాబ్దాలకు పైగా అనేక పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. ఈయన హయాంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెయ్యికి పైగా పేటెంట్లు పొందింది.

150కి పైగా పరిశోధన పత్రాలు.. పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ఈయన విదేశాల్లో అనేక సంస్థల్లో బోర్డు సభ్యునిగా, సలహాదారునిగా ఉన్నారు. ఒక తెలుగు వ్యక్తి.. ఇలా దేశ ప్రగతి కోసం ఆలోచించి.. రీసైకిల్ అయ్యే అల్యూమినియంను ఉపయోగించి.. బ్యాటరీ తయారుచేయవచ్చునని తెలుసుకుని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈయన చేస్తున్న పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 2024లో అల్యూమినియం ఎయిర్ బ్యాటరీతో నడిచే కార్లను మనం చూడబోతున్నాం. ఈ అల్యూమినియం కాన్సెప్ట్ ని ద్విచక్ర వాహనాలకు కూడా తీసుకొస్తే బాగుంటుంది కదా. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటి? మరి కరెంటుతో పని లేకుండా.. నడిచే ఈ అల్యూమినియం బ్యాటరీని తీసుకురానున్న ఇండియా, ఇజ్రాయెల్ కంపెనీలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Tags :

  • Aluminium Air Battery
  • Electric Vehicles
  • India
  • israel
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

    జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

    టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

  • పోలీసుల హెచ్చరిక!.. కారుపై త్రివర్ణ పతాకం ఏర్పాటు చేసుకున్నారా? జైలుపాలవుతారు?

    పోలీసుల హెచ్చరిక!.. కారుపై త్రివర్ణ పతాకం ఏర్పాటు చేసుకున్నారా? జైలుపాలవుతారు?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam