టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్-2 నుండి ఏ జట్లు సమీస్ కి వస్తుందన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే ఈ గ్రూప్ నుండి పాకిస్థాన్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మరో.. ప్లేస్ కోసం మిగతా టీమ్ లు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ శుక్రవారం నమీబియా వర్సెస్ న్యూజిలాండ్ టీంలు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న నమీబియా జట్టు ఆదిలోనే న్యూజిలాండ్ కి షాక్ ఇచ్చింది.
ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ ఓపెనర్స్ మార్టిన్ గప్టిల్, మిచెల్‌ను 7 ఓవర్ల లోపే నమీబియా బౌలర్లు పెవిలియన్ చేర్చారు. దీంతో.. కివీస్ 10 ఓవర్లలో 60 పరుగులకే పరిమితం అయ్యింది. కెప్టెన్ విలియంసన్, కాన్వే స్ట్రైక్ రొటేట్ చేయడానికి సైతం ఇబ్బంది పడేలా నమీబియా బౌలర్లు అద్భుతమైన బంతులను సంధించారు. ఇలా 16 ఓవర్స్ వరకు కూడా న్యూజిలాండ్ రన్ రేట్ 6 దాటాకపోవడం విశేషం. అయితే.., చివరిలో ఫిలిప్స్, నీషం బ్యాట్ ఝళిపించడంతో కివీస్ స్కోర్ బోర్డు పరిగెత్తింది. చివరి నాలుగు ఓవర్లలోనే న్యూజిలాండ్ 60కి పైగా పరుగులు సాధించడం విశేషం. ఇక 20 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 4 వికెట్స్ నష్టానికి 163 పరుగులు సాధించడం విశేషం. నమీబియా లాంటి పసికూన ఈ టార్గెట్ అందుకోవడం అంత సులభం కాకపోయినా, టీ ట్వంటీ క్రికెట్ లో ఏమైనా జరగొచ్చు. ఒకవేళ నమీబియా ఈ టార్గెట్ ని అందుకుంటే మాత్రం ఇండియాకి సెమీస్ దారులు తెరుచుకున్నట్టే.
Kane out
Good job boys restrict them to 130 #Namibia pic.twitter.com/YO6oLuyqlr— Anjan (@lone_melancholy) November 5, 2021
Indians during Whole match after seeing Death overs balling of #Namibia 💔#NZvNAM #NZvsNAM pic.twitter.com/WNIBAREzD0
— Harshit Thakur (@USA47POTUS) November 5, 2021