క్రీడా ప్రపంచంలో ఏదైన ఒక జట్టు తమ దేశ పర్యటనకు వస్తోంది అంటే చాలు.. ఆ జట్టును మానసికంగా దెబ్బకొట్టాలని చూస్తాయి. ఇలా చూసే జట్లలో ముందు వరుసలో ఉంటాయి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు. ముందుగా ప్రత్యర్థి జట్టును మాటలతో ఇబ్బంది పెట్టడమే వారి పని. తాజాగా అలాంటి పనే చేశాడు ఓ జింబాంబ్వే క్రికెటర్. ప్రస్తుతం టీమిండియా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం జింబాంబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలోనే తన మాటలతో ప్రత్యర్థిని దెబ్బతీయాలని చూశాడు ఓ బ్యాటర్. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
KL రాహుల్ సారథ్యంలోని భారత జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం జింబాంబ్వే పర్యటనకు వెళ్లింది. ఇండియా తన మెుదటి వన్డేను ఈ నెల 18న ఆడనుంది. ఈ క్రమంలోనే జింబాంబ్వే జట్టు ఆల్ రౌండర్ భారత్ పై మాటలతో గురి పెట్టాడు. అందులో భాగంగానే ఈ సిరీస్ ను 2-1 తో తాము కైవసం చేసుకుంటాం అంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు ఇన్నోసెంట్ కియా .అయితే ఇటీవలో బంగ్లదేశ్ ను వారి సొంతగడ్డపైనే ఓడించింది. అదే జోరును భారత్ పై కూడా చూపించాలని ఆత్రుతతో ఉంది.
ఇన్నోసెంట్ కియా.. బంగ్లాదేశ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో సిరీస్ పై స్పందిస్తూ.. టీమిండియాతో సిరీస్ లో జింబాంబ్వే 2-1 తో గెలుస్తుందని జోస్యం చెప్పాడు. అదీ కాక తాను వరుస శతకాలు సాధిస్తాననే నమ్మకం కూడా ఉన్నట్లు తెలిపాడు. మేం కచ్చితంగా గెలుస్తాం.. ప్రస్తుతం ఇండియా టీంలో విరాట్, రోహిత్,పంతో లాంటి విలువైన ఆటగాళ్లు లేరు. అయినప్పటికి మేం భారత్ ను తక్కువ అంచనా వేయం, మేం పోటీకి సిద్ధంగా ఉన్నాం అని తెలిపాడు.
అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ.. కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే కానీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండరాదు అంటూ చూరకలు వేశారు. కియా ఇప్పటి వరకు 6 వన్డేలు మాత్రమే ఆడాడు. 245 పరుగులు చేయగా 110 అత్యధిక పరుగులు. ఇక అతడు 8 టీ20లు ఆడి 119 రన్స్ చేశాడు. ఈ గణాంకాలు ఉండి భారత్ పై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.